Mukesh Ambani: వామ్మో.. ముఖేష్ అంబానీ డ్రైవర్ కు అన్ని లక్షలు ఇస్తున్నారా?

Mukesh Ambani: ముఖేష్ అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలకు ముకేశ్ అంబానీ సుపరిచితమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులలో టాప్ ఫైవ్ లో ముఖేష్ అంబానీ కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక ముఖేష్ అంబానీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్నది ఆయనకే తెలియదు. ఆయన రోజు సంపాదన కోట్లల్లో ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్ సంస్థకి అధినేత అయిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతూ అంబానీ ఇద్దరు కూడా ప్రతిరోజు లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు.

 

తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు ఉతి ఒక్కటి కూడా లగ్జరీనే అని చెప్పవచ్చు. ముఖేష్ అంబానీ కి ఉన్న ఇళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటిని ఇల్లు అనడం కంటే ఇంద్రభవనం అనడం కరెక్టేమో. ఎందుకంటే ముఖేష్ అంబానీ ఇల్లు ఒక్కొక్కటి ఇంద్రభవనాన్ని తలపిస్తూ ఉంటాయి. ఇకపోతే చాలామందికి ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వారి జీతం ఎంత ఉంటుంది వారికి ఎంత ఇస్తారు. వారికి క్వాలిఫికేషన్ కూడా ఉంటుందా ఇలా అనేక రకాల సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక ముఖేష్ అంబానీ డ్రైవర్ అంటే అతని శాలరీ గురించి అలాగే అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో తలుచుకుంటూనే చాలామంది సంతోషపడుతూ ఉంటారు.

నాకు అలాంటి అవకాశం వస్తే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ధనవంతులు సెలబ్రిటీల కార్లకు డ్రైవర్లు నియమించే వారిని ముందుగా ప్రైవేట్ కాంటాక్ట్ ద్వారా ఎంపిక చేసి వారికి లగ్జరీ కార్ల నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ల వరకు అన్నింటిని ఎలా నడపాలో ట్రైనింగ్ ఇస్తారు. అదే విధంగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న వారికి మాత్రమే అలాంటి ధనవంతులు సెలబ్రిటీల కార్ల డ్రైవర్లుగా నియమిస్తూ ఉంటారు. అయితే ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలు. అయితే 2017 లోనే డ్రైవర్ కి రెండు లక్షల రూపాయలు అంటే ఇప్పుడు మూడు నుంచి నాలుగు లక్షల వరకు అందుకుంటూ ఉంటాడని అంచనా. 35 నుంచి 40 లక్షల వరకు సంవత్సరానికి ముఖేష్ అంబానీ డ్రైవర్ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -