Chiranjeevi: వామ్మో.. చిరంజీవి కొనుగోలు చేసిన ఇంటి ఖర్చు అన్ని రూ.కోట్లా?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డం, చరిష్మా సొంతం చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. సినిమా రంగంలో ఎలాంటి పరిచయాలు లేకుండా, సొంతంగా, తన స్వశక్తి మీద ఆధారపడి పైకి ఎదిగిన స్టార్ హీరో చిరంజీవి. చిన్న క్యారెక్టర్లు వేసే దగ్గరి నుండి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మెగాస్టార్ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శం.

 

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందంటే ఉంటే హడావిడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం చిరంజీవి, డాలీ డైరెక్షన్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేయగా.. అది ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ తర్వాత ‘భోళాశంకర్’ అనే మరో ప్రాజెక్టు చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో జరిగిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ అయింది.

 

మెగాస్టార్ ఈ రెండు సినిమాల కోసం అని తీసుకున్న రెమ్యునరేషన్ మరియు అడ్వాన్స్ తో తన కూతురు శ్రీజకు ఓ ఇల్లును కొచ్చాడని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇల్లు అమ్మకానికి ఉంటే.. దానిని రూ.35కోట్లు పెట్టి చిరంజీవి కొన్నాడని సమాచారం. ఈ ఇంటిని తన కూతురు శ్రీజ పేరు మీదకు మార్చాడని, తన కూతురి మీద ఉన్న ప్రేమను ఇల్లు రూపంలో చిరు తెలియజేశాడనే చర్చ నడుస్తోంది.

 

కాగా గతంలో కూడా చిరంజీవి తన కుటుంబ సభ్యుల కోసం పలు గిఫ్టులు, ఇల్లు, స్థలాలు కొనడం తెలిసిందే. తన తోబుట్టువుల కోసం మెగాస్టార్ హైదరాబాద్ లోని కోకాపేటలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే కొన్ని ఎకరాల భూమిని చిరంజీవి కొనిచ్చాడని సమాచారం. తన కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి ఇలా చేస్తూ ఉంటాడని.. మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -