Egg Shell: వామ్మో.. గుడ్డు పెంకుతో ఇన్ని లాభాలా?

Egg Shell: కోడిగుడ్డు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కోడి గుడ్డుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొందరు బాయిల్డ్ ఎగ్ తింటే మరి కొంతమంది కోడిగుడ్డుతో కూరలు చేసుకుని తింటూ ఉంటారు. అయితే మనలో చాలామంది కోడిగుడ్డు లోపలి భాగాన్ని తింటే బయట భాగాన్ని తినరు. బయట భాగాన్ని తింటే లోపలి భాగాన్ని తినరు. ఈ సంగతి పక్కన పెడితే కోడిగుడ్డు వల్ల మాత్రమే కాకుండా కోడి గుడ్డు పెంకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

కోడిగుడ్డు పెంకులను మొక్కలకు ఎరువులా కూడా వేస్తూ ఉంటారు. అయితే కోడిగుడ్డు పెంకులను పూర్వం వారు చర్మ సంబంధించిన సమస్యలకు ఉపయోగించేవారు. కోడిగుడ్డు పెంకులను ఉపయోగించడం వల్ల చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి. గుడ్డు పెంకులను మెత్తగా నూరి చర్మానికి రాసుకుంటే చాలు. అలాగే మొండి మరకలను వంటపాత్రలను శుభ్రం చేయడంలో గుడ్డుపెంకులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. పొలంలో ఎరువుల తయారికి కూడా ఉపయోగపడుతాయి.

 

కోడి గుడ్డు పెంకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ కాల్షియం అవసరాలు తీర్చేందుకు సూప్స్, జ్యూస్ లేదా స్మూతిస్ లో గుడ్డు పెంకుల పొడిని కలుపుకుని తాగొచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం కోడి గుడ్డు షెల్ సగం తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన కాల్షియం అందిస్తుంది.

 

నత్రజని, భాస్వరం లాగా మొక్కలు పెరగడానికి కాల్షియం అవసరం. మొక్కలకు కాల్షియం ఇవ్వడానికి గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించవచ్చు. పక్షులకు దానగా కూడా గుడ్డు పెంకులను వాడుతుంటారు. గుడ్డు పెంకుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. గుడ్లు పెట్టే పక్షులకు ఇది మంచి పోషకాహారంగా పనిచేస్తుంది.
దంతాల ఆరోగ్యానికి గుడ్డు పెంకుల పొడి చాలా బాగా పనిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ ఆ విషయంలో భయపడుతున్నారా.. అలా జరుగుతోందా?

CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానం, ఆయన మాటలు వైసిపి మంత్రులకు ఎమ్మెల్యేలకు అంతు చిక్కడం లేదు. జగన్ ఆలోచన విధానాలను అంచనా వేయలేకపోతున్నారు. ఇకపోతే గత...
- Advertisement -
- Advertisement -