Sprouted peas: మొలకెత్తిన పెసలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

Sprouted peas: ఆరోగ్యం బాగా ఉండాలి అంటే సరైన నిద్రతో పాటు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. తరచూ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో పాటు మొలకెత్తిన గింజలు తినడం వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది వీటి గురించి వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియక వాటిని మానేసి చిరుతిండ్లు,ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడిపోయారు. వైద్యులు కూడా మొలకెత్తిన గింజలను తినమంటూ ఉంటారు. అటువంటి పెసలు కూడా ఒకటి. మరి మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డయాబెటిస్ ఉన్నవారు తరచుగా
మొలకలను తినడం వల్ల ఇన్సిలిన్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. తరచుగా మొలకలు తినడం వల్ల ఇన్సులిన్‌ అవసరం తగ్గుతుంది. వీటి వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే మొలకల్లో ఉండే పైబర్ లు షుగర్ లేని వారికి భవిష్యత్తులో షుగర్ సమస్య రాకుండా కూడా చూస్తుంది. కాబట్టి ప్రతి రోజు కప్పు పెసర మొలకలు తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వారు షుగర్ లేని వారికి కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నవారు ఆహారం తీసుకోకుండా కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల మరింతగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

 

కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు పెసర మొలకలు తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. పెసల్లలో ఉండే ప్రోటీన్లు శరీరంకు కావాల్సిన శక్తిని అందజేయడంతో పాటు కొవ్వు పదార్థాలు కరిగిపోయేలా చేస్తాయి. బరువు తగ్గాలి అనుకున్న వారు మొలకెత్తిన పెసలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకు పోయిన వారు తప్పకుండా తినాల్సిన ఆహారంలో ఖచ్చితంగా మొలకలు కూడా ఒకటి. ప్రేగులు, పొట్ట నడుము భాగంలో చాలా మందికి కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. దాన్ని కరిగించే గుణం పెసర మొలకలకు ఉంది. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ శాతంను పూర్తిగా తగ్గించవచ్చు. అలాగే అజీర్తి సమస్యతో బాధ పడే వారు, మలబద్దకం సమస్యతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడేవారు మొలకలు తినడం వల్ల మెటబాలిజం సక్రమంగా పని చేస్తుంది. మరి ముఖ్యంగా ఆహారవ్యవస్థ అనేది బాగుంటుందని, తద్వార అజీర్తిసమస్య మలబద్దక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా మొలకెత్తిన పెసలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -