Health Tips: కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన చిట్కాలివే.. ఏం చేయాలంటే?

Health Tips: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు కూడా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కంటి చూపు సమస్యలతో బాధపడుతూ కళ్ళజోడు పెట్టుకొని మనకు కనిపిస్తూ ఉంటారు.ఇలా చిన్న పిల్లలలో కూడా ఇలా కంటి చూపు సమస్య రావడానికి గల కారణం పోషకాహార లోపం అని చెప్పాలి. పోషకాహార లోపం వల్ల ప్రతి ఒక్కరూ దృష్టిలోపంతో బాధపడుతున్నారు.

చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లకు బానిసలు కావడం చేత కంటి చూపు సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.ఇలా వివిధ కారణాలవల్ల చిన్న వయసులోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ సింపుల్ చిట్కాని కనుక పాటిస్తే ఇకపై మీకు కంటి చూపు సమస్య అనేది ఉండదు. మరి ఆ చిట్కాలు ఏంటి అనే విషయానికి వస్తే…

 

కంటి చూపును మెరుగుపరచడం కోసం బాదంపప్పు, పటిక,సోంపు ఈ మూడింటిని సమానభాగాలలో తీసుకోవాలి. ఇక వీటిలో బాదంపప్పు సోంపు విడివిడిగా దోరగా వేయించుకోవాలి. ఇక ఈ మూడింటిని కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ఇలా భద్రపరుచుకున్నటువంటి ఈ పౌడర్ ను ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిన్న పిల్లలయితే ఒక టీ స్పూన్ పౌడర్ ను పాలలో కలుపుకొని తాగాలి పెద్దవారు అయితే రెండు టీ స్పూన్ల పౌడర్ పాలలో కలుపుకొని రోజుకు రెండు పూటలా తాగాలి.

 

ఈ విధంగా ఆరు నెలల పాటు ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి తాగటం వల్ల ఏ విధమైనటువంటి కంటిచూపు సమస్యలు మీ దరికి చేరవు.కంటి చూపు మెరుగుపడటమే కాకుండా ఇతరత అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మన శరీరానికి కావలసినంత కాల్షియం అందడమే కాకుండా ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇక శరీరంలో వేడిని కూడా తొలగిస్తుంది. ఈ మిశ్రమంతో పాటు ఆకు పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్స్ అధికంగా తినడం వల్ల కంటి చూపును మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

AP Youth Turns as GIG Workers: హైదరాబాద్ లో గిగ్ వర్కర్లుగా లక్షల సంఖ్యలో ఏపీ యువత.. ఈ పరిస్థితి దారుణమంటూ?

AP Youth Turns as GIG Workers: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో సమావేశం ఏర్పరచగా అందులో సకానికి పైగా ఆంధ్రప్రదేశ్ యువత వున్నది అని తెలిసింది....
- Advertisement -
- Advertisement -