Devotional: భోజనం చేశాక చేయకుండా ఐదు రకాల తప్పులు ఇవే?

Devotional: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే మనం తినే ఆహారాన్ని తొక్కకూడదని పారేయకూడదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వాటిని పెడ చెవినపెడుతూ ఉంటారు. కానీ చాలామంది అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి తినేముందు కాళ్లు, చేతులు కడుక్కుని మరీ భోజనానికి కూర్చుంటారు. కొందరు అన్నని తినేటప్పుడు దేవుడిని తలచుకొని మరి తింటూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే చాలని భావిస్తారు.

అటువంటి అన్నం విషయంలో తినేటప్పుడు కొన్ని రకాల అసలు చేయకూడదు.. మరి అన్నం తినేటప్పుడు ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నం తినేటప్పుడు అది ప్లేట్ చుట్టూ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కిందపడినా వెంటనే తీసేయాలి. కింద పడ్డ తుకులను ఎవరూ తొక్కకుండా శుభ్రం చేయాలి. కానీ చాలామంది భోజనం చేశారు అంటే చుట్టూ అన్నంని ఉలకబోస్తూ ఉంటారు. అన్నం తినేటప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఆహారాన్ని ముగించాలి. ఆహారాన్ని ముగించిన తరువాత చేతులను ప్లేట్ లో కడగకూడదు. చేతులు బయట కడుక్కోవాలి. తిన్న ప్లేట్లో చేతులు కడగకూడదు.

 

ప్లేట్ ఎండి పోకూడదు చేతులు కడిగినా, తిన్న ప్లేట్ ఎండినా దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని అర్థం. ఆహారం ముగించి నిద్రపోయేముందు గిన్నెలు శుభ్రం చేయడమో లేదంటే అవి ఎండిపోకుండా నీళ్లు పోయడమో చేస్తుంటారు. అన్నం తినేటప్పుడు మధ్యలో దగ్గో, తుమ్మో వస్తే అక్కడే ఉమ్మేయడం, దగ్గేయడం చేయరాదు. పొలమారితి అక్కడి నుంచి లేచి వెళ్లి చేతులుకడుక్కుని వచ్చి భోజనం చేయాలి. కొంతమంది అలాగే కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. కూర్చుని మాత్రమే భోజనం చేయాలి ఎప్పుడూ కూడా నిలబడి తినకూడదు. తిన్నాక చేతులు విదిలించకూడదు. కడుక్కున్న చేతుల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. భోజనం పూర్తైన తర్వాత పుల్లలు, వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. నీళ్లను పుక్కిలించి ఉమ్మేయడం మంచిది.
భోజనం పూర్తైన తర్వాత ఒళ్లంతా బరువుగా ఉందంటూ తిన్నప్లేట్ పక్కనే నడుం వాలుస్తారు. అది పరమ దరిద్రానికి హేతువు. తిన్న ప్లేట్ అక్కడే ఉంచి ఎప్పుడూ ఆ పక్కనే నిద్రపోరాదు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు...
- Advertisement -
- Advertisement -