Carrot: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?

Carrot: చలికాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ లు వస్తూ ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు అనారోగ్యం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటం కోసం అవసరమయ్యే పోషకాలను శరీరానికి తప్పకుండా అందించాలి. శీతాకాలంలో కూరగాయలను తినడం వల్ల చేయడానికి కావలసిన పోషకాలు అందుతాయి. మరి ముఖ్యంగా క్యారెట్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. మరి శీతాకాలంలో క్యారెట్ తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

శీతాకాలంలో ప్రతిరోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడం మాత్రమే కాకుండా హానికరమైన బ్యాక్టీరియా వైరస్ ల నుంచి రక్షణ పొందడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలు కణజాల పునర్నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ క్యారెట్ జ్యూస్ లో ఉండే అధిక ఫైబర్ కారణంగా మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు. బ్లడ్ షుగర్ తో బాధపడేవారు తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగిన మొత్తంలో మెయిన్ టెయిన్ అవుతాయి.

 

క్యారెట్ లో ఉండే క్యాలరీలు, విటమిన్లు, మినరల్స్ మధుమేహాన్ని నిరోధించడానికి పోరాడతాయి. అది శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అందులో ఉండే బీటా కోరెటిన్ గుండె జబ్బులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి, ఇ, అలాగే ఫోలెట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా చెడు ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ జరగకుండా తగ్గిస్తుంది. దాంతో గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. శీతాకాలంలో క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -