Suicide: ఆ అనాథ యువతి ఆత్మహత్యకు కారణాలెంటో?

Suicide: నేటి కాలంలో యువతి, యువకులు ఏ చిన్న ఇబ్బంది తలెత్తిన దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెంచి పెద్ద చేసి నానా కష్టాలు పడుతూ ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు, సంరక్షకుల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. కొంతమంతి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లి కలిసి మెలిసి తిరుగుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఈ క్రమంలో ఇద్దరిలో ఒకరైనా ఆ బాధను తట్టుకోలేక ఇళ్లు వదిలిపారివడం లేదా ఆత్మహత్యలకు పాల్పడూ కుటుంబాలను శోక సంధ్రంలో ముంచుతున్నారు.
మరికొంత మంది విద్యార్థులు చదువు ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఇలాంటి దురాఘాతాలకు పాల్పడి వారి కుటుంబాలను మరింతా శోకాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా జరిగిన ఘటనలో అమ్మాయి ఆత్మహత్యకు కారణాలు దొరక్క పోలీసులు  తలలు పీక్కుంటున్నారు. అందుకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని అయత్‌పూర్‌ పట్టణానికి చెందిన అనాథ అయిన చింపి షైనీ (20), విజయనగరంలోని తోటపాలెంలో గదిలో చేసుకున్న ఆత్మహత్య కలకలం రేపుతోంది. అనాథఅయిన చింపి షైనీ విశాఖలోని ఓ వ్రైవేట్‌ హోటల్లో పని చేస్తోంది.  తెలిసిన మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి నెల క్రితం విజయనగరంలోని తోటపాలెం షిర్డీసాయినాథ్‌ కాలనీలో అద్దెకు దిగారు. ముగ్గురు వారి వారి విధులకు వెళ్లి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి షైనీతో పాటు గదిలో ఉండే ఇద్దరు యువతులు కలిసి ఓ చిన్న పార్టీ చేసుకున్నారు. అంతా ముగిసిన తర్వాత ఎక్కడికక్కడ సర్ధి అంతా కలిసి భోజనం చేసుకున్నారు. కాసేపు మాట్లాడుకుని  అర్ధరాత్రి 2.30 గంటలకు ఎవరి గదుల్లోకి వారు వెళ్లి నిద్రకు ఉపక్రమించారు.

 ఆదివారం ఉదయం వేకువజామున వారి గదికి వచ్చి యజమానికి షైనీ బెడ్రూంలో కిటికికీ చున్నీతో ఉరేసుకుని కన్పించింది.  ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇంటి యజమాని మిగత ఇద్దరిని నిద్ర నుంచి లేపి పోలీసులకు సమాచారం అందించాడు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి బెడ్రూమ్‌లలో క్షుణ్ణంగా పరిశీలించారు.ఎలాంటి ఆధారాలు లేఖలు దొరకలేదు. ఫైనీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారామా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -