NTR: ఎన్టీఆర్ గొప్పదనం చెప్పిన బాలకృష్ణ.. ఏం చెప్పారంటే?

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒక వైపు సినిమా ఇండస్ట్రీలో మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక బాలకృష్ణ గారికి తన తండ్రి ఎన్టీఆర్ గారు అంటే ఎంత అభిమానం, గౌరవమో మనకు తెలిసిందే. ఇక తన తండ్రి గురించి ఎప్పుడు మాట్లాడిన బాలయ్య ఎంతో గొప్పగా తన తండ్రి గొప్పదనాన్ని వర్ణిస్తూ ఉంటారు.

బాలకృష్ణ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు అంటే ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ కి తర్వాత అనే విధంగా ఉన్నాయని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కృషివల్లే తెలంగాణలో సమూల మార్పులు వచ్చాయని బాలయ్య తెలియజేశారు.ఇలా ఎన్టీఆర్ చేసిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.

 

తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయం నుంచి పార్టీ కోసం పని చేస్తున్నటువంటి కార్యకర్తల కష్టమే ఈ అభివృద్ధి అని తెలియజేశారు. ఇక ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన విజయంతో వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావాలని బాలకృష్ణ సూచించారు. ఇక పాత తరం వారికి రాజకీయాలన్న సినిమాలన్న ఎన్టీఆర్ గారే గుర్తుకు వస్తారని ఆయన సినిమాలు ఆయన రాజకీయాలు మాత్రమే వారికి గుర్తు ఉంటాయని తెలిపారు.

 

ప్రాంతాలు వేరైనా తెలుగు వారందరూ ఒకటేనని ఇలా ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చడం సరైనది కాదు అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ సైతం హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరోవైపు వరస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -