Sreemukhi: పెళ్లిపై స్పందించిన శ్రీముఖి.. ఏం చెప్పిందంటే..?

Sreemukhi: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ యాంకర్‌గా మంచి పేరు, క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి బిగ్‌బాస్ షోతోనూ మరింత పాపులారిటీ సంపాదించింది. సుమ తర్వాత ఫీమేల్ యాంకర్స్‌లో శ్రీముఖి టాప్‌లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆమె ఆఫర్లను దక్కించుకుంటోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె సందడి చేస్తోంది. సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు చేస్తోంది.

 

తాజాగా శ్రీముఖి పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ బిజినెస్ మేన్‌తో ఆమె ఏడు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఎవరా అని నెటిజన్‌లు తెగ చర్చలు జరుపుతున్నారు. సదరు బిజినెస్‌మ్యాన్‌తో శ్రీముఖి సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం సాగిస్తోందని తెలుస్తోంది. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు కూడా తెలుసు అని సమాచారం. ఇటీవలే శ్రీముఖి, ఆమె ప్రేమాయణం నడుపుతున్న బిజినెస్ మేన్ ఫ్యామిలీల పెద్దలు సీక్రెట్‌గా సమావేశం అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. దీంతో శ్రీముఖి ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతుందని అందరూ భావిస్తున్నారు.

 

అయితే శ్రీముఖి మాత్రం తన పెళ్లివార్తలను ఖండించింది. ఇప్పుడిప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. తనకు తండ్రి వరుస అయ్యే వ్యక్తితో సంబంధం అంటగడుతున్నారని గాసిప్ రాయుళ్లపై మండిపడింది. ప్రస్తుతం తాను సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని వెల్లడించింది. మరో మూడు లేదా నాలుగేళ్ల తర్వాతే తన పెళ్లి గురించి ఆలోచిస్తానని.. ఒకవేళ పెళ్లి చేసుకుంటే తానే ఆ విషయం స్వయంగా మీడియాకు చెప్తానని తెలిపింది.

 

కాగా శ్రీముఖి గతంలో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాతో శ్రీముఖి వెండితెరకు పరిచయం అయింది. దీని తర్వాత నేను శైలజ, జెంటిల్‌మెన్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది ‘ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లోనూ లీడ్ రోల్ కూడా చేసింది. వెండితెరపై నటిస్తున్న సమయంలోనూ అదుర్స్ అనే షోతో యాంకర్‌గా మారింది. పటాస్ షోతో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోకు వెళ్లింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -