Balayya: బాలయ్య భార్య గురించి ఇండస్ట్రీలో ఇలా అనుకుంటున్నారా?

Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ పరంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు 106 సినిమాల్లో నటించిన బాలయ్య.. గతేడాది ‘అఖండ’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే గతంలో కంటే బాలయ్య ఇప్పుడు ఫుల్ జోష్ మీద కనిపిస్తున్నారు. తనలోకి కొత్త వేరియేషన్స్ ని బయటికి తీస్తూ అన్‌స్టాపబుల్ టాక్‌ షోలో వ్యాఖ్యతగా దూసుకెళ్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్ ఫాలొయింగ్ మరింత రెట్టింపు అయింది. ఆ తరం వాళ్లకే కాకుండా.. యంగ్ జనరేషన్‌కు కూడా బాలయ్య ఈజీగా కనెక్ట్ అవుతన్నారు. బాలయ్య యాటిట్యూట్, మాస్ యాంగిల్‌కు ఫిదా అవుతున్నారు.

 

 

బాలయ్య తన వ్యక్తిగత విషయానికి ఎక్కడా బయటకు చెప్పుకోరు. ఇప్పటికే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ అవి ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు. బాలయ్య భార్య వసుంధర కూడా గృహిణి. ఆమె కూడా బయట ఎక్కువగా కనిపించరు. కేవలం ఫ్యామిలీ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తుంటారు. సినిమా వ్యవహారాలు వసుంధరకు పెద్దగా పట్టవని సమాచారం.

 

అయితే బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో బాలయ్య తరఫున వసుంధర ప్రచారాల్లో పాల్గొన్నారు. బాలయ్య గెలుపునకు కారణమయ్యారు. వరుసగా రెండోసారి హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య భారీ మెజార్టీతో గెలిచారు. దీని వెనుక వసుంధర కృషి ఎంతో దాగి ఉంది. వసుంధర పుట్టినిల్లు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత ఎస్‌ఆర్ఎంటీ చౌదరి సోదరుడి కుమార్తె. అయితే వసుంధరది గోల్డెన్ లెగ్ అని భావిస్తుంటారు. ఆమె తన చేత్తో డబ్బులు ఇస్తే.. బాగా కలిసోస్తుందని నమ్ముతారట. అందుకే నిర్మాతలు కూడా బాలయ్యతో సినిమా చేసేటప్పుడు వసుంధర చేత్తో డబ్బులు తీసుకుంటారట. వసుంధర తన చేత్తో డబ్బులు ఇస్తే చాలా మందికి కలిసి వచ్చినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -