NTR: ఫ్యాన్స్ కోరిక విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏమంటారో?

NTR: ఒకప్పుడు పౌరాణిక చిత్రాలు అంటే అన్న నందమూరి తారకరామారావు శోభన్ బాబు వంటి వారు మాత్రమే గుర్తుకు వచ్చే వారు. అనంతరం కైకాల సత్యనారాయణ కూడా ఎలాంటి పౌరాణిక పాత్రలలోనైన ఇట్టే ఇమిడి పోయేవారు.అయితే ఈ తరం హీరోలలో ఇలాంటి పౌరాణిక పాత్రలలో నటించే హీరోలు పెద్దగా ఎవరూ లేరని తెలుస్తుంది ఒకవేళ నటించిన ఆ పాత్రకు వందశాతం న్యాయం చేయలేరు అనేది తెలుస్తుంది. పౌరాణిక చిత్రాలలో నటించాలి అంటే మొహంలోనే ఆ తేజస్సు కనిపించేలా ఉండాలి.

ప్రస్తుతం గ్రాఫిక్స్ మాయలో పడి పౌరాణిక పాత్రల రూపురేఖలనే మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తరం హీరోలలో పౌరాణిక పాత్రలలో కనుక నటించాల్సి వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే ఇలాంటి పాత్రలకు వంద శాతం న్యాయం చేయగలరని అభిమానులు భావిస్తున్నారు. ఈయన బాల నటుడిగా బాల రామాయణం సినిమాల్లో రాముడి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా రాముడు పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు.

 

ఇలా రాముడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినా ఎన్టీఆర్ తిరిగి మరోసారి రాముడి పాత్రలో నటిస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇలా అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్ రాముడు పాత్రలో నటిస్తారా అభిమానుల కోరికను తీర్చుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక తారక్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 

రాజమౌళి సినిమా తర్వాత ఈయన కొరటాల శివ సినిమాకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది. ఇదివరకే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -