Pomogranate and Papaya: రెండు పండ్లు కలిపి తింటే ఆరోగ్యం లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

Pomogranate and Papaya: దాదాపుగా ప్రతి పండ్లల్లో విలువైన ప్రోటీన్లు ఉంటాయి. అందుకే వైద్యులు ఆహార పదార్థాల్లో వివిధ రకాల పండ్లను తీసుకోవాలని సూచిస్తుంటారు. ప్రతి పండులో ఒక్కో రకం పోషకాలు ఉంటాయి. ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మరియు రుచికరమైన పండ్లలో దానిమ్మ మరియు బొప్పాయి ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అయితే ఈ రెండు పండ్లను విరివిగా కాకుండా ఒకేసారి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఒక కప్పు బొప్పాయి పండును ముక్కలను కట్‌ చేసి పెట్టుకోవాలి.అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క వలిచి లోపల ఉండే గింజలను వేరు చేయాలి. ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్‌ ను తీసుకుని పీల్‌ తొలగించి మంచి నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్‌ తీసుకుని అందులో కట్‌ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, దానిమ్మ గింజలు, రెండు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్, ఒక గ్లాస్‌ వాటర్‌ వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.ఇలా గ్రైండ్‌ చేసుకున్న జ్యూస్‌ లో వన్‌ టేబుల్‌ స్పూన్‌ తేనె ను మిక్స్‌ చేసి సేవించాలి.వారంలో కనీసం మూడు సార్లు ఈ బొప్పాయి దానిమ్మ జ్యూస్‌ను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఇలా తాగితే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తపోటు అదుపులో ఉండటం తో పాటు చూపు మెరుగుపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంతేకాక మెదడు మునుపటి కన్నా మరింత చురుగ్గా పని చేస్తుంది. ఇలా ఈ రెండు పండ్లను కలిపి తింటే మతిమరుపు సైతం దూరమై నిరంతరం అలెర్ట్‌గా ఉంటారని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -