Anasuya Bharadwaj: అనసూయ విజయ్ దేవరకొండను కావాలనే గెలుకుతోందా.. ఏమైందంటే?

Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం వెండితెర నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యి ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వెండితెరపై నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో ఒక విషయం గురించి కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే కొన్ని పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. అయితే ప్రస్తుతం అనసూయ విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య పెద్ద వార్ నడుస్తుందని చెప్పాలి.విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి లిప్ కిస్ సన్నివేశాల నుంచి వీరిద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది వీలు దొరికినప్పుడల్లా అనసూయ విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తూ ఉన్నారు.ఇక లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అనసూయ చేసిన ట్వీట్ కారణంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

 

ఈ విషయంపై ఈమె ఏకంగా విజయ్ దేవరకొండ అభిమానులపై పోలీస్ కేసులు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా నుంచి పోస్టర్ విడుదల కాగా అందులో విజయ్ దేవరకొండ పేరుకు ముందు The అని ఉండడంతో ఈమె దీనిని హైలెట్ చేస్తూ కామెంట్ చేశారు. పైత్యం మనకు అంటకుండా చూసుకోవాలి అంటూ కామెంట్ పెట్టారు.అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ అభిమానులు మరోసారి అనసూయను ట్రోల్ చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా అనసూయ చేసిన కామెంట్లపై విజయ్ దేవరకొండ అభిమానులు స్పందిస్తూ ది అని మీరు హైలైట్ చేస్తే మేము కూడా ఆంటీని హైలెట్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా మీ పేరుకు ముందు ది ఆంటీ అని పెట్టుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ విషయంపై గత రెండు రోజులుగా విజయ్ దేవరకొండ అభిమానులకు అనసూయకు మధ్య వార్ జరుగుతుంది. దీంతో పలువురు అనసూయ వ్యవహారం పై స్పందిస్తూ వేలు పెట్టి గెలుక్కోవడం అవసరమా…అనసూయ కావాలనే విజయ్ అభిమానులను టార్గెట్ చేస్తున్నారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -