Balayya: ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న బాలకృష్ణ.. ఏమైందంటే?

Balayya: టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. ఇటీవలే ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండుగ కానుకగా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ టాక్ ని అందుకున్న బాలయ్య బాబు అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలు టాక్ షోలు మరోవైపు రాజ‌కీయ‌లు, కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్స్ చేస్తు ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబు మరో కొత్త అవతారం ఎక్కి ఎందుకు సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. క్రికెట్ కామెంటేట‌ర్ గా అవ‌తారం ఎత్తేందుకు బాల‌య్య సిద్ధ‌మాయ్యారట.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో బాల‌య్య కామెంట‌రీతో అద‌ర‌గొట్ట‌నున్న‌ట్లు స్టార్ స్పోర్ట్స్ ప్ర‌క‌టించింది. మార్చి 31న ప్రారంభ‌మ‌య్యే ఐపీఎల్ ఓపెనింగ్ డే రోజు ఎంట‌ర్టెన్మెంట్ వేరే లెవెల్ లో ఉండ‌బోతుంది అంటూ ట్వీట్ చేసింది. బాల‌య్య లైవ్ లో ఎలా మాట్లాడుతారో ఎలాంటి కొత్త కొత్త ప‌దాలు మాట్లాడారో అని బాలయ్య బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ నెల 31న మొదలు కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సర్వం సిద్ధం అయ్యింది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ లీగ్ జరగనున్న విషయం తెలిసిందే.

 

మే 28న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. ఇక ఆరంభ మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే బాలయ్య బాబు విషయానికి వస్తే.. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బాలయ్య బాబు అదే ఊపుతో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపుతూనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటించనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అంటే బాలయ్య బాబు సినిమా ఎలా ఉండబోతుంది? కామెడీగా ఉంటుందా లేకుంటే ఎప్పటిలాగే మాస్ సినిమాగా ఉంటుందా? అన్న అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -