Chiranjeevi-Balakrishna: చిరంజీవికి దిమ్మతిరిగే షాకిచ్చిన బాలయ్య.. ఏమైందంటే?

Chiranjeevi-Balakrishna: సాధారణంగా సినిమా హీరోల మధ్య పెద్ద ఎత్తున పోటీలు ఉండడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా మెగా నందమూరి కుటుంబంలోని సినిమాలపరంగా హీరోలలో పోటీ ఉండటమే కాకుండా అభిమానులలో కూడా పెద్ద ఎత్తున పోటీలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వీరిద్దరూ సినిమాల విషయంలో బిజీగా ఉండగా వీరి సినిమాల లుక్స్ విషయంలో అభిమానులు ఇద్దరి మధ్య లుక్స్ విషయంలో తేడాలను గమనిస్తూ మదన పడుతున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో బాలకృష్ణ తాను చేసే సినిమాలన్నీ కూడా తన ఏజ్ కు అనుగుణంగా ఉన్నవి ఎంపిక చేసుకొని కిరాక్ లుక్ లో ఫుల్ ఎనర్జీ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఒకప్పుడు బాలకృష్ణ లుక్స్ విషయంలో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ సినిమాలు టాక్ షోలలో ఈయన లుక్స్ చూస్తుంటే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయం గురించి మెగా అభిమానుల సైతం ఎంతో మదన పడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం బిగ్ అప్డేట్ విడుదల చేశారు.ఇందులో భాగంగా వీరు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఇందులో చిరంజీవి లుక్స్ దారుణంగా ఉన్నాయని మెగా అభిమానులు మదనపడుతున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరంజీవిని మెహర్ రమేష్ ఎంతో అద్భుతంగా చూపించారు. అలాంటిది తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం చిరంజీవిని చాలా యంగ్ గా చూపించడం కోసం పూర్తిగా ఆయన లుక్స్ మార్చారు. దీంతో చిరంజీవి లుక్స్ విషయంలో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా చిరంజీవి లుక్స్ విషయంలో మెహర్ రమేష్ ఇలాంటి షాక్ ఇచ్చారేంటని మదన పడుతున్నారు.ఇలా సినిమాల లుక్స్ విషయంలో చిరంజీవి కన్నా బాలకృష్ణ ఎంతో బెటర్ గా ఉన్నారని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -