Employees: ఉద్యోగుల కొరకు జగన్ తీసుకున్న నిర్ణయమిదే.. ఏం జరిగిందంటే?

Employees: తాజాగా ఏపీ సీఎం జగన్ ఉద్యోగుల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలా తెలివిగా ఆలోచిస్తూ ఒక్కొక్క హస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు జగన్. ప్రభుత్వం నుంచి ఏ కీలక హామీల కోసం అయితే ఉద్యోగులు గట్టిగా పట్టుబడుతున్నారో, ఆయా అంశాలలో నిర్దిష్టమైన ప్రకటన చేశారు జగన్. వాటితో పాటు ఉద్యోగ వర్గాలు ఎంతో ఆశగా ఎదురు చూసే 12వ పిఆర్ సి ని అడగకముందే ఏర్పాటు చేయడం ద్వారా వారి అభిమానాన్ని చూరకొనే ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ సంబంధించిన బుధవారం నాటి క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అనేది జగన్ ప్రభుత్వానికి మెడలో గుదిబండలాగా తయారైన వ్యవహారం. పాదయాత్ర సమయంలో పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చినందుకు జగన్ ఈ ఊబిలో పూర్తిగా ఇరుక్కుపోయారు. ఉద్యోగులు మాత్రం ఆచరణాత్మక దృక్పథంతో సాధ్యాసాధ్యాలను గమనించకుండా సిపిఎస్ రద్దు చేసి తీరాల్సిందే అంటూ ఇన్నాళ్లుగా గొడవ చేస్తున్నారు. అయితే మధ్యేమార్గంగా జగన్ సర్కారు ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఏ స్థాయి పెన్షన్ నిర్ణయం జరుగుతుందో ఇంచుమించు దానితో సమానంగా ఉండేలాగా ఈ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా రూపుదిద్దారు.

 

దీనికి సంబంధించి తుది విధానాల రూపకల్పన ఇంకా జరగాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం అనేది అతిపెద్ద వరంగా చెప్పుకోవాలి. అలాగే 11వ పి ఆర్ సి పెండింగ్ చెల్లింపులను నాలుగేళ్లలో పూర్తిగా చెల్లించేస్తామని ప్రభుత్వం ప్రకటించడం కూడా గొప్ప విషయం.

ఉద్యోగ సంఘాలు ఇంకా డిమాండ్ ప్రారంభించక మునుపే 12వ పిఆర్సి సంఘం ఏర్పాటుకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కంటె ముందే 11 వ పీఆర్సీని అమలు చేసిన తెలంగాణ సర్కారు ఇప్పటిదాకా కొత్త పీఆర్సీ ఏర్పాటు గురించి ఆలోచన కూడా చేయడం లేదు. జగన్ మాత్రం, త్వరలోనే పిఆర్సి వేస్తామని కూడా ప్రకటించారు.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -