NTR: ఆరేళ్లు టార్చర్ చూసిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

NTR: ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్యాడ్ టైమ్ అనేది ఉంటుంది. ఆ టైంలో ఏం చేసినా కూడా మంచి జరగదు. జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో కూడా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు బ్యాడ్ టైం నడిచిందని చెప్పొచ్చు. ఆ ఆరేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఇటు సినీ కెరీర్ పరంగా అటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను చూడటమే కాదు అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు.

 

2009 సంవత్సరంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ టైంలో డాక్టర్లు డ్యాన్స్ చేయకుండా ఉండాలని చెప్పారట. అయితే ఎన్టీఆర్ మాత్రం సినిమాలపై ఉండే ఇష్టంతో డ్యాన్స్ ను చేశారట. తారక్ ప్రచారం చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు కూడా రాకపోవడంతో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారాలు సాగాయట.

 

తనకు వ్యతిరేకంగా సాగే ఆ ప్రచారాలు ఎన్టీఆర్ ను చాలా ఇబ్బంది పెట్టాయని తారక్ సన్నిహితులు చెప్పేవారు. 2010వ సంవత్సరంలో తారక్ అదుర్స్, బృందావనం వంటి సినిమాలతో సక్సెస్ సాధించారు. అయితే ఆ సినిమాలు కూడా రికార్డులు క్రియేట్ చేసేంత విజయం కాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే 2010వ సంవత్సరంలో తారక్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు లక్ష్మీ ప్రణతి అప్పుడు మైనర్ అని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో లక్ష్మీ ప్రణతి మేజర్ అయిన తర్వాతే తారక్ ఆమెను పెళ్లాడట.

 

2011 సంవత్సరంలో తారక్ కు శక్తి సినిమాతో మరో డిజాస్టర్ సినిమాను తీశారు. అదే సంవత్సరంలో విడుదలైన ఊసరవెల్లి సినిమా కూడా నిరాశను కలిగించింది. ఆ తర్వాత దమ్ము సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ టైంలో నెగిటివ్ ప్రచారం ఎక్కువగా వైరల్ అయ్యింది. బాద్ షా యావరేజ్ హిట్ టాక్ వచ్చినా ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హిట్ తో తారక్ గ్లోబల్ స్టార్ అయ్యి ముందుకు సాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

AR Rahman: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కొత్త కారు ధర ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

AR Rahman: భారతీయ సంగీత పరిశ్రమ విషయానికి వస్తే, ఎక్కువగా కనిపించే పేర్లలో ఒకటి AR రెహమాన్. భారతీయ సంగీత స్వరకర్త, రికార్డు నిర్మాత, గాయకుడు మరియు పాటల రచయిత తన అసాధారణ...
- Advertisement -
- Advertisement -