Nani: ఆ డైరెక్టర్ల స్కాములు బయటపెట్టిన నాని.. ఏం జరిగిందంటే?

Nani: టాలీవుడ్ స్టార్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని ప్రస్తుతం దసరా సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నాని కెరియర్ లో తొలిసారిగా నటించిన పాన్ ఇండియా సినిమా దసరా. అంతేకాకుండా మొదటిసారిగా నాని ఇందులో మాస్ లుక్ లో కనిపించిన ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.

 

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకులకు ముందుకు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. సినిమా కోసం నాని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో నాని రవితేజ తో కలసి చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన కెరియర్ లో ఎదుర్కొన్న కష్టాలు అవమానాల గురించి తెలిపారు.

 

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. నా ఫోటో ఆల్భమ్‌ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఎక్కడా కనీసం నన్ను లోపలి కూడా రానివ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేద్దామన్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిదిద్దరు కో డైరెక్టర్స్‌​ నన్ను డ్రైవర్‌ లాగా కూడా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకి నా ఎటీఎమ్‌లో పండగలకు బట్టలు కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులను కూడా కొట్టేశారు. ఈ స్కాములన్నీ చూశాక ఇక మళ్ళీ మళ్ళీ మోసపోవడం నా వల్ల కాదని, నటుడిగా ప్రయత్నాలు ఆపేసి ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మారాను అని నాని చెప్పుకొచ్చాడు.

 

మొద అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి నేడు పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు. ఇకపోతే నాని నటించిన దసరాసినిమా నుంచి ఇప్పటికీ వదిలిన పాటలు పోస్టర్లు టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -