Pawan Kalyan: జనసేనను కాపాడుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: తెలుగు ప్రేక్షకులకు హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయనకి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సినిమా పరంగా పవన్ ని అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ అభిమానించేవారు అంతేమంది ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేదల కష్టాలను తరిమికొట్టి వారి జీవితంలో ఆనందం నింపాలి అన్న ఉద్దేశంతో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సొంతంగా జనసేన అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని బావించారు.

ఇదే క్రమంలో 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ గుర్తుగా గాజు గ్లాసును భారత ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ఆ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నది. పలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. పార్టీ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం తగినన్ని ఓట్లు, సీట్లు సాధించలేకపోవడం వల్లే ఈసీ జనసేన పార్టీ గర్తును ఫ్రీ సింబల్ కేటగిరిలో పెట్టినట్లుగా తెలుస్తోంది.

 

మరోవైపు 2024ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీకి సిద్దమవుతున్న జనసేనకు ఊహించని షాక్ తగిలింది. రాజకీయ పార్టీ ప్రాంతీయ,జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకారం కొన్ని సీట్లను గెలవాలి. ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతాన్ని కూడా లెక్కగడతారు. గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, గెలుచుకున్న సీట్లను ఆధారంగా చేసుకొనే ఎన్నికల గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ.అలాగే జనసేనకు ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటు గెలిచినా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాసును కేటాయిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -