Blind Scholar: అంధురాలైనా ఆ ఘనత సాధించిన విద్యార్థిని.. ఏం జరిగిందంటే?

Blind Scholar: తమ అంగాలలో లోపాలు ఉన్నప్పటికీ కూడా తమ కలలు తీర్చుకోవడానికి ముందుకు వస్తుంటారు కొందరు వికలాంగులు. నిజానికి అన్ని బాగున్న వారి కంటే వికలాంగులకే తమ లక్ష్యానికి చేరుకోవాలన్న కసి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం.

చత్తీస్ ఘడ్ లో రాయపూర్ పరిధిలో గుడియాపరిలో జనతి కాలానికి చెందిన అంధురాలు దేవశ్రీ బోయర్ తాజాగా పీహెచ్డీ పట్టా పొంది అందరిచే శభాష్ అనిపించుకుంది. ఇక తను ఈ గుర్తింపు అందుకోవటం కోసం తన వెనుక తన తండ్రి అమెఘ కృషి ఉందని తెలిసింది.

 

తన కూతురు థీసేస్ రాయడం కోసం తండ్రిగా తను ఎంతో సహకరించారట. ఇక దేవ శ్రీ కూడా తను సాధించిన ఈ గౌరవాన్ని తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు తనలో నమ్మకాన్ని మరింత పెంపొందించారని.. తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని.. వారిచ్చిన ధైర్యంతోనే ఈ విజయం సాధించాను అని తెలిపింది.

 

తన తండ్రి చిన్న దుకాణం నడుపుతున్నాడని.. తాము ఉండే ఇల్లు చాలా చిన్నదని.. ఆ దుకాణం ద్వారా వచ్చే డబ్బుతోనే తమ ఇల్లు గడుస్తుందని.. తన తండ్రి దుకాణం చూసుకుంటూనే తన చదువులో సహకారం అందించారని తెలిపింది. 10 గంటల పాటు తన దగ్గర కూర్చొని చదివించిన రోజులు కూడా ఉన్నాయని.. ఈరోజు తను ఈ పట్టా అందుకున్నాను అంటే దానికి తన తండ్రి సహకారమే అని..

 

తను నేత్రహీనురాలిని అయినందుకు ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను అంటూ.. ఇదే తనని పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది అంటూ..ఇక దానికి తోడు తన తండ్రి అందించిన సహకారం మరువలేనిదంటు.. తన కోసం రాత్రి వేళ మేలుకొని థీసేస్ రాసేవారని.. తన తండ్రి ఎంత అలసిపోయినా కూడా తనకోసం సమయానికి కేటాయించేవాడని తెలిపింది.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -