Delhi: పశువుల వ్యాపారంతో కళ్లు చెదిరేలా సంపాదిస్తున్న అమ్మాయిలు.. ఏమైందంటే?

Delhi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి చదువులు చదివి ఒకరి కింద పని చేయకుండా సొంతంగా వారి కాళ్ళపై వాళ్లు నిలబడి బిజినెస్ లు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మామూలుగా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ పట్టబద్రులు అంటే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ సమాజంలో గౌరవమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇటీవల కాలంలో పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది మంచి మంచి చదువులు చదివి వారు చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేసి గ్రామాల్లో సొంతంగా వ్యాపారాలు చేసి లక్షలు,కోట్లకు కోట్లు బిజినెస్ లు చేస్తున్నారు.

 

కాగా తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు ఐఐటీ స్టూడెంట్స్ యానిమల్ టెక్నాలజీ స్థాపించి కోట్లలో డబ్బులను సంపాదిస్తున్నారు. నీతూ యాదవ్, కీర్తి జంగ్రా అనే ఇద్దరు యువతులు ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేశారు. కానీ వారు వాళ్ళ మంచి ఉద్యోగవకాశాలు వదులుకొని యానిమల్ టెక్నాలజీస్ స్థాపించి కోట్లు సంపాదిస్తున్నారు. ఢిల్లీలో ఐఐటీ రూమ్ మెట్స్ గా కలిసి చదువుకున్న నీతూ యాదవ్, కీర్తి జంగ్రా 2019లో పశువుల కోసం ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమల్ ని ప్రారంభించారు. తరువాత బెంగుళూరు లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడ ప్రారంభించిన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి జీవనోపాది కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

పాడి రైతుల జీవితాలను మార్చి, పశువుల వ్యాపారం, పరిశ్రమలను లాభాల బాటలో నడిపించేందుకు కొన్ని మార్గాలు సూచించే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు. కాగా వీరి వ్యాపారంలో కూడా మొదట ఇబ్బందులు ఎదురయ్యాయి. తమకు ఎదురైన సమస్యలను సున్నితంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు. తర్వాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి ఎక్కువ ఆర్డర్స్ పొందడం మొదలైంది. అలా 2022 లో ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీ ఆదాయం లో దాదాపు 90 శాతం పశువుల వ్యాపారం నుంచి రాగా మిగిలిన పది శాతం మెడిసన్ ఖర్చులు, సేల్స్ కమిషన్, అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది.

యానియల్ అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఏర్పాటు చేసిన ఆన్ లైన్ మార్కెట్. ఇందులో ఎలాంటి మోసపూరిత మార్కెటింగ్ లేకుండా జన్యూన్ గా కొనసాగుతుంది. పశువులను అమ్మడం, కొనుగోలు చేయడం ఉంటుంది. యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు ఆన్ లైన్ మార్కెట్ లో దుమ్మురేపుతుంది. ఇందులో జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయెల, షాదీ. కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ తో పాటు మరికొంత మంది వ్యాపార దిగ్గజాలు ముగ్గురు ఎనిమల్ ఏంజెల్ భాగస్వామ్యులుగా ఉన్నట్టు తెలుస్తుంది

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -