Bihar: మధ్యాహ్న భోజనంలో పాము కలకలం.. అసలేం జరిగిందంటే?

Bihar: ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం ఇటువంటి మంచి మంచి పథకాలను తీసుకువచ్చినప్పటికీ స్కూల్లో విద్యార్థులకు వండి పెట్టే వారు మాత్రం విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఉప్పు పప్పు లేని కూరలు పెట్టి విద్యార్థులను అనారోగ్యాల పాలు చేస్తున్నారు. విద్యార్థులు తినే తిండి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

కొన్నిసార్లు వంటవాళ్ల నిర్లక్ష్యం వల్ల తినే ఆహారంలో పురుగులు, బల్లులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ పాఠశాల విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కలకం సృష్టించింది. ఈ ఘటన బీహార్ అరారియా జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్ లోని ఫర్​బిస్‌గంజ్ సబ్‌డివిజన్ జోగ్బాని మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన అమౌనా సెకండరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకున్నారు. పిల్లలు ఒక్కసారిగా ఎందుకు వాంతులు చేసుకున్నారన్న విషయం పరిశీలించగా భోజనంలో పాము కనిపించింది.

 

ఆ భోజనం 100 మందికి పైగా చిన్నారులు ఆహారం తిన్నారు అందులో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండలేదని ఓ కాంట్రాక్టర్ దీనిని సరఫరా చేశారని సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొద్ది సేపు పాఠశాల వద్ద ఆందోళన చే ప్రస్తుతం చిన్నారులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఉన్నత కమిటీతో విచారణ చేయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు హామీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -