Janasena Party: జనసేనకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చిన టీడీపీ.. ఏమైందంటే?

Janasena Party: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి జరుగుతుంది. ఈ క్రమంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా జనసేన పార్టీ టిడిపి పొత్తు గురించి ఇదివరకే పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. ఇలా పొత్తు గురించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడమే కాకుండా తాను సీఎం పదవిని ఏమాత్రం ఆశించడం లేదని తెలిపారు.

తనకు సీఎం పదవి పై వ్యామోహం లేదంటూ చెబుతూనే తను కేవలం చంద్రబాబు నాయుడుని గెలిపించే సైనికుడిగా ముందుకు కదులుతాను అన్నట్టు తన స్థాయిని తాను పూర్తిగా తగ్గించుకుంటూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం స్థానంలో లేరు కనుక ఇప్పుడు అసెంబ్లీ స్థానాలలో ఎన్ని జనసేన పార్టీకి టికెట్లు ఇస్తారన్న విషయం గురించి చర్చ మొదలైంది.

 

ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టిడిపిలో కలపడంతో తనకి ఎన్ని సీట్లు కావాలని కరాకండిగా చెప్పే పరిస్థితులు ఏమాత్రం కనబడటం లేదని టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తనకు ఎన్ని టికెట్లు ఇస్తే అన్ని టికెట్లు తీసుకోవడం తప్ప మరే మార్గం లేదని తెలుస్తుంది.

 

ఈ క్రమంలోనే టిడిపి నాయకుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో పోటీ చేశారు అయితే ఈ ఏడాది కూడా ఆ రెండు స్థానాలలో కలిపి మరో ఐదు స్థానాలలో జనసేన పార్టీకి టికెట్లు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ఇలా ముష్టిగా పవన్ కళ్యాణ్ కు కేవలం 7 నియోజకవర్గ స్థానాలలో టికెట్లు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా కండిషన్లు పెట్టలేదని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -