Viral: అల్లుడిని మండపంలో చెప్పుతో కొట్టిన మామ.. ఏం జరిగిందంటే?

Viral: మన భారతదేశంలో పెళ్లి అంటే ఎన్నో సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఉంటాయి అయితే పెళ్లి అన్న తర్వాత కట్న కానుకలు ఇవ్వడం కూడా ఒక సాంప్రదాయంగా మారిపోయింది.కట్నం ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ పెద్ద ఎత్తున తమ కూతురు అత్తవారింట్లో బాగుండాలని అమ్మాయి తరఫు వారు కట్న కానుకలు అందజేస్తుంటారు.అయితే కొంతమంది అబ్బాయి కుటుంబ సభ్యులు అడిగే కట్న కానుకలు వల్ల అమ్మాయి కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

ఇలా కట్న కానుకలు విషయాలన్నీ కూడా పెళ్లికి ముందే మాట్లాడుకొని అనంతరం పెళ్లి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే కొంతమంది అబ్బాయిల తీరా పెళ్లికి ముందు లేదా పెళ్లి మండపంలోనూ తమకు అదనపు కట్న కానుకలు కావాలి అని గొంతేమ్మ కోరికలు కోరుతారు.ఇలాంటి సమయంలో తమ కుటుంబ పరువు ప్రతిష్టలు పోతాయన్న ఉద్దేశంతో అమ్మాయి తల్లిదండ్రులు తమ కష్టమైన వారు అడిగినది ఇవ్వడానికి ఒప్పుకుంటారు.

 

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయాలు తెలియకపోయినా ఇది మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెళ్లి మండపంలోనే అల్లుడిని మామ చెప్పుతో కొట్టినటువంటి ఘటన చోటుచేసుకుంది. ఇలా మామ తన కొత్త అల్లుడిని కొట్టడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈయన పెళ్లి తర్వాత పెళ్లి మండపంలోనే తనకు బైక్ కావాలని కోరిక కోరారట.

 

ఇలా పెళ్లి మండపంలో తనకు బైక్ కావాలని కోరడంతో అప్పటికే కట్న కానుకలు ఇచ్చి ఎంతో సతమతమవుతున్న ఆ వధువు తండ్రికి పట్టరాని కోపం రావడంతో ఒక్కసారిగా తన కాలిలో ఉన్న చెప్పు తీసుకొని మండపంలోనే తన కొత్త అల్లుడిని చితకబాదారు. ఇలా అల్లుడు పై మండపం లోనే మామ చెప్పుతో కొట్టడంతో ఇది చూసినటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే పెళ్లికి వచ్చిన కొందరు దీనిని సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Prabhas-Sreeleela: ప్రభాస్, శ్రీలీల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమేనా?

Prabhas-Sreeleela:  పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి శ్రీ లీల. ఇలా మొదటి సినిమాతోనే తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం రవితేజ...
- Advertisement -
- Advertisement -