AP Weather: ఏపీలో ఊహించని స్థాయిలో వర్షాలు.. ఏం జరిగిందంటే?

AP Weather: బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా అరేబియన్ తీరం వరకూ విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండీ సూచనలు జారీ చేసింది.

బంగాళాఖాతం నుంచి అరేబియన్ తీరం వరకూ అంటే ఉత్తర తమిళనాడు ముంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకూ సమద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించిన ఉపరితల ద్రోణి..అటు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా వరకూ విస్తరించింది. ఫలితంగా ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు,మోస్తరు వర్షాలు పడుతున్నాయి.అటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.ఇక రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తా,ఉత్తర కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది.

 

ఇవాళ అంటే శనివారం నాడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. ఇక రేపు ఆదివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు.

 

రాగల మూడ్రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీయనున్నాయి. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. మొత్తానికి మూడ్రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అంటే శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన మోస్తరు వర్షాల వల్ల పంటల కాస్త దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఎండుమిర్చి నిల్వలు తడిసిపోయాయి.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -