Narendra Modi: మోదీ ఆటలకు భారీ షాక్ తగిలిందిగా.. ఏం జరిగిందంటే?

Narendra Modi: ప్రధానమంత్రిగా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. లెఫ్ట్ నెంట్ గవర్నర్ అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీఢిల్లీ ముఖ్యమంత్రిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. అయితే మోడీ ఆటలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఢిల్లీ రాష్ట్రంపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పేసింది.

ఎల్జీ హోదాలో ప్రభుత్వాన్ని పక్కనపెట్టేసి పాలనలో, జనాలపై పెత్తనం చేస్తామంటే కుదరదని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్రానికి సంబంధించిన ఏ వ్యవహారంలో అయినా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానిది ఆఖరి నిర్ణయం అని ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. ఢిల్లీలో ఎలాగైనా కేజ్రీవాల్ ను గద్దే దింపడం కోసం మోడీ ఎన్నో ప్రయత్నాలు చేశారు.

 

వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఈయనని ఈసారి తప్పకుండా అధికారం నుంచి తొలగించాలని మోడీ పక్క ప్రణాళికలు రచించారు. ఎల్జీని అడ్డంపెట్టుకుని మోడీ బాగా ఇబ్బందులు పెడుతున్నారు. అసెంబ్లీ, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎల్జీ దాన్ని అడ్డుకుంటున్నారు. తమ ఆమోదముద్ర లేనిదే ఏ పని చేయడానికి వీలులేదని ఏ బిల్లు కూడా ముందుకు వెళ్ళదని ఎల్జీ పట్టుబడ్డారు.

 

ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ బిల్లు పెట్టిన ఆమోదముద్ర లేకపోవడంతో ప్రజల దృష్టిలో తనని ఒక అసమర్థుడిగా చిత్రీకరించడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. ఇందులో భాగంగానే సుప్రింకోర్టులో కేసు వేశారు. దీనిపై సింగిల్ బెంచ్ తీర్పుచెబుతు ఎల్జీకి అన్నీ అధికారాలు ఉన్నాయని చెప్పింది. ఎల్జీ చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. దీంతో మోడీ ఆటలకు కోర్టు చెక్ పెట్టినట్టు అయిందని చెప్పాలి. ఇలా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోర్టు కేజ్రీ వాల్ కిఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వటంతో ఇది తనకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -