WhatsApp: మరో అద్భుతమైన ఫీచర్ అందించనున్న వాట్సాప్.. త్వరలో వాయిస్ స్టేటస్?

WhatsApp: ఈ మధ్యకాలంలో స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న వారికి వాట్సాప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటివరకు వాట్సాప్ ఎన్నో ఫీచర్లతో ముందుకు వచ్చింది. వాట్సాప్ నిర్వహకులు కొత్త ఫీచర్లు అందించినప్పుడల్లా యూజర్స్ వాట్సాప్ అప్డేట్ చేసుకొని కొత్త ఫీచర్లను బాగా వాడుకుంటున్నారు.

ఇప్పటికే డెస్క్‌టాప్ యూజర్ల కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇమేజ్ బ్లర్ టూల్‌ ను ప్రస్తుతం డెస్క్ టాప్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో కూడా మంచి మంచి ఫీచర్లు అందించింది వాట్సాప్. అయితే తాజాగా వాట్సాప్ స్టేటస్ గురించి ఒక కొత్త ఫీచర్ అందించింది. మామూలుగా స్టేటస్ లో వీడియోస్, ఫొటోస్, టెక్స్ట్, లింకులు మాత్రమే అప్ లోడ్ అవుతూ ఉంటాయి.

కానీ త్వరలో వాయిస్ ను కూడా అందించనుందంట వాట్సాప్. ప్రస్తుతం ఐఓఎస్ బీటా వెర్షన్ లో కొందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇక ఈ వాయిస్ స్టేటస్ కూడా 30 సెకండ్ల వరకు పెట్టుకోవచ్చని తెలిసింది. ఇది కూడా 24 గంటల వరకు యాక్టివ్ గా ఉంటుంది. ఈ ఫీచర్ మిగతా వెర్షన్ వాళ్లకు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యూజర్లు ఏదైనా వాయిస్ క్లిప్స్ వస్తే ఒకేసారి స్టేటస్ లో పెడితే సరిపోతుంది. ప్రతిసారి అన్ని గ్రూపులోకి ఫార్వర్డ్ చేయటం కంటే ఇలా ఒకేసారి స్టేటస్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఆ వాయిస్ ని వినే అవకాశం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -