Sri Reddy: శ్రీరెడ్డి క్యారెక్టర్‌పై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

Sri Reddy: సినీ ఇండస్ట్రీలో వివాదాలు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరే వినిపిస్తుంది. ఆయన ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు పాజిటివ్‌గా మాట్లాడారని అనుకుంటే.. మరుక్షణం వారిపై దారుణమైన ఆరోపణలు చేస్తారు. అలాగే ఆర్జీవీ కేవలం ఒక్కరికి మాత్రమే సపోర్ట్ చేస్తారనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే ఆర్జీవీ ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడుతారో చెప్పడం అందరికీ కష్టం. అప్పట్లో ఆర్జీవీ మెగా ఫ్యామిలీపై దారుణమైన ఆరోపణలు చేసే వారు. కానీ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ మధ్యకాలంలో భజన మొదలు పెట్టారు.

దీంతో చిరంజీవిపై కూడా రెస్పెక్ట్ కలిగి ఉన్నట్లు ఆర్జీవీ నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్జీవీతోపాటే శ్రీరెడ్డి కూడా కాంట్రవర్సీ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ హీరోలను, నిర్మాతలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏకి పడేస్తారు. అయితే గతంలో శ్రీరెడ్డిపై ఆర్జీవీ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగిన సమయంలో అధ్యక్ష పోటీలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజు పోటీ చేశారు. అప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు. ఒకరికి ఒకరు మద్దతు తెలుపుతూ వార్తల్లో నిలిచారు. ఆర్జీవీ కూడా భారీ స్థాయిలో కామెంట్లు చేశారు.

మా ఎలక్షన్స్ అసలు ఉందా? అని ఆర్జీవీ ప్రశ్నించారు. శ్రీరెడ్డి చీర విప్పినప్పుడే తనకు మా అసోసియేషన్ ఉందనే విషయం తెలిసిందన్నారు. అప్పటివరకు మా అసోసియేషన్ ఉందనే విషయం తెలియదన్నారు. అలాంటి మా అసోసియేషన్‌కు ఎన్నికలు ఎందుకు?, దానికి సీనియర్ యాక్టర్స్ పోటీ పడటం ఎందుకు? అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. అలాగే అప్పట్లో ప్రకాశ్ రాజ్‌ను కూడా సపోర్ట్ చేశారు. టాలీవుడ్‌లో వందల సినిమాల్లో నటించిన ప్రకాశ్ రాజ్‌ను ‘నాన్ లోకల్’ అని ప్రత్యర్థులు ఆరోపించారు. ఈ విషయంపై ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే లోకల్, నాన్ లోకల్ అనే లెగసీని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -