Samantha: సినిమాలకు దూరంగా సమంత అక్కడికి వెళ్లిందా?.. ఎందుకో?

Samantha: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది సమంత, అంత పెద్ద ఫ్యాన్ అయిన సమంత తన భర్త తో విడాకుల తరువాత చాలా మారిపోయిందని అనుకోవచ్చు. తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా పంచుకోవడం లేదు. దానిలో భాగంగా గత కొంత కాలంగా సమంత జాడ తెలియడం లేదు. ఆమె విదేశాలకు వెళ్ళి వచ్చారని అలా కొంతకాలం గడిచిందని ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లేరనే వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అందుకే ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లారని, అంతకు ముందు పూజలు, హోమాలు చేయించారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ సమంత టీమ్ వైపు నుంచి అవన్నీ తప్పు అంటూ వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఏదో జరుగుతోంది. సమంత చేస్తున్న రెండు సినిమాలు యశోద, శాకుంతలం అలా వుండిపోయాయి.

త్రీడీ వెర్షన్ అనే మాట చెప్పి, శాకుంతలం సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసేసారు. యశోద సినిమా డేట్ ఇవ్వలేదు కానీ డబ్బింగ్ వర్క్ పెండింగ్ లో పడింది.విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సమంత ప్రస్తుతం కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ లో వున్నారని తెలుస్తోంది. మరి అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారో లేదా, ఇటీవల వరుసగా వస్తున్న సమస్యల కారణంగా కాస్త మనశ్శాంతిగా వుంటుందని అక్కడ వున్నారో తెలియదు.

ఈ నెల 10న అక్కడి నుంచి వస్తారని తెలుస్తోంది. వచ్చిన తరువాత డబ్బింగ్ చెబితే ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి. మొత్తానికి సమంత ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని తనకు అంతా మంచే జరగాలని, నీ రాబోయే సినిమాల కోసం ఎదురుచూస్తున్నామని ప్రజలు వారి వారి రీతులలో కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -