Surendranagar: ప్రియుడి కోసం కొడుకు అడ్డు తొలగించుకున్న మహిళ.. ఎక్కడంటే?

Surendranagar: తాజాగా గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సావర్కుండ్లకు చెందినది హుస్సేనా వాఘర్ మహిళ 8 ఏళ్ల క్రితం సావర్కుండ్లలో నివసించే సలీంభాయ్ రఫాయిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు వయసు నాలుగేళ్లు కాగా రెండో కొడుకు ఆర్యన్ ఉమర్ వయస్సు 2ఏళ్ళు. మొదట్లో బాగానే ఉన్నా భార్యాభర్తల మధ్య ఆ తరువాత తరచూ మధ్య విభేదాలు, గొడవలు తలెత్తాయి. దాంతో అప్పటికి హుస్సేనా మూడేళ్ల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకొని రాజ్‌కోట్‌లో నివసిస్తోంది. హుసేనా భర్త సలీంభాయ్ కూడా రాజ్‌కోట్‌లోని తన అత్తారింటి పక్కనే విడివిడిగా ఉండేవాడు.

గత 6 నెలల నుంచి హుస్సేనా పిల్లలిద్దరినీ పదే పదే కొట్టడంతో భర్త విసుగు చెంది సొంత ఊరికి వెళ్లిపోయాడు. సుమారు నెలన్నర రోజులుగా హుస్సేనా జాకీర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన చిన్న కొడుకు ఆర్యన్‌తో కలిసి వాద్వాన్ ప్రాంతంలో ప్రియుడితో కలిసి నివసిస్తోంది. రెండేళ్ల బాలుడు ఆర్యన్‌ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి హుసేనాతో పాటు ఆమె ప్రియుడు జాకీర్ ఇద్దరూ తరచూ కొట్టేవారు. అయితే ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న హుసేనా జాకీర్‌తో కలిసి తరచూ బిడ్డను చావబాదుతూ ఉండేది. మార్చి 8న కూడా అదే విధంగా ఆర్యన్‌ను ఇద్దరూ కలిసి బలమైన వస్తువుతో కొట్టారు. చిన్నారికి తీవ్రగాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం రాజ్‌కోట్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

 

చిన్న కొడుకు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి అంత్యక్రియలకు వచ్చి బిడ్డ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వీపు, పొత్తి కడుపు, వెనుక భాగంలో దెబ్బలతో కమిలిపోయిన మచ్చలు చూసి వైద్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఫోరెన్సిక్, బృందం, పోలీసులు స్పాట్‌కు చేరుకొని పసివాడి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లుగా తేలడంతో కన్నతల్లి హుసేనా, ఆమె ప్రియుడు జాకీర్‌పై కేసు నమోదు చేశారు. తన బిడ్డను భార్య, ఆమె ప్రియుడు కలిసి చంపారని మృతుని తండ్రి సురేంద్రనగర్ బి డివిజన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే కొడుకును హత్య చేసిన తల్లి హుసేనా వాగర్‌తో పాటు ఆమె ప్రేమికుడు జాకీర్ ఫకీర్‌లను పట్టుకున్నారు. వారిద్దరూ హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -