Earphones: హెడ్‌సెట్‌ను ఎక్కువగా వాడితే.. ఆ సమస్యలు వెంటాడుతాయి!

Earphones: ఎవరైనా కొత్త ఫోన్‌ తీసుకుంటే దాని కన్నా మంచిది ఇయర్‌ఫోన్స్‌ కొంటున్నారు. ప్రస్తుతం ఎవరూ కూడా ఫోన్‌ను చెవికి పెట్టుకుని మాట్లాడం లేదు.. అందరూ ఇయర్‌ ఫోన్‌ నుంచి మాట్లాడుతున్నారు. ఇంత వరకు పర్వాలేదు. కానీ.. కొందరు గంటల తరబడి చెవుల్లోంచి ఇయర్‌ ఫోన్లను తియనే వారు. మరికొందరైతే పాటలు వింటూ వింటూ ఇయర్‌ ఫోన్‌ పెట్టుకునే నిద్రలోకి జారుకుంటారు.

అయితే.. ఈ ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడంతో వినికిడి సామర్థ్యంపై ప్రభావం పడటమే కాకుండా గుండె సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెడ్‌ఫోన్లు లేదా ఇయర్‌ఫోన్ల నుంచి వచ్చే శబ్దం చెవిపోటుకు దగ్గరగా ఉన్న కర్ణభేరిని తాకడం వల్ల చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య పెరిగితే చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవడంతో మెదడుపై కూడా ప్రభావం చూపుతోంది. వాస్తవానికి, ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌ల నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై ప్రభావం చూపుతాయి.

కొన్నిసార్లు ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ధ్వని భ్రాంతి కలుగుతుంది. ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడంతో వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అది గుండె సమస్యలను కూడా కలిగిస్తుంది. చాలా మంది తమ హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌లను పరస్పరం మార్చుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఇయర్‌ఫోన్‌లోని స్పాంజ్‌ ద్వారా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది. ఇది చెవి ఇన్ఫెక్షన్‌కు కూడా కారణం కావచ్చు. అంతే కాకుండా చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల చెవి నరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది సిరల వాపు కు దారితీస్తుంది. కంపనం వల్ల వినికిడి కణాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి.

మరికొందరు ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని ప్రయాణంలో సంగీతం వింటారు. చుట్టుపక్కల వాతావరణంలో ట్రాఫిక్‌ శబ్దం వినకుండా నిరోధించవచ్చని వారు భావిస్తున్నారు. కొన్నిసార్లు ఈ పద్ధతి మరింత హానికరం అని రుజువు చేస్తుంది. వాస్తవానికి, ఇది చుట్టుపక్కల వాతావరణంలో చెల్లాచెదురుగా ఉన్న డెసిబెల్‌ల శబ్దం నుండి రక్షిస్తుంది. అయితే ఇయర్‌ఫోన్‌ల ద్వారా నేరుగా చెవులకు చేరే పెద్ద శబ్దం చెవి లోపలి భాగాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్న తర్వాత మొబైల్‌ వాల్యూమ్‌ విపరీతంగా పెంచడం వల్ల చెవిపోటు దెబ్బతింటుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -