KCR: ఏపీకి అన్యాయం చేసింది ఎవరు.. కేసీఆర్ సమాధానం చెబుతారా?

KCR: సోనియా గాంధీ కాంగ్రెస్ అధినేత్రిగా వ్యవహరించి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన విభజన తీరులో ఏపీకి అన్యాయం తెలంగాణకు న్యాయం జరిగేలా చేయటం అదే విషయాన్ని పరోక్షంగా కేసీఆర్ తన మాటల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే రాష్ట్రం కోరుకున్న వారి ప్రయోజనాల కంటే కూడా ప్రాంతాన్ని కోల్పోతున్న రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తారన్నది వాస్తవం. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాత్రం రివర్స్ లో వ్యవహరించారు అన్న వాదనలు ఎక్కువగా వినిపించాయి.

రాష్ట్రం కలిసి ఉండాలన్న పట్టుదలతో ఉద్యమం చేసిన ఆంధ్రవాళ్లు విభజన వేళ తమకు కావాల్సిన డిమాండ్లను అడిగింది కూడా లేదు. ఎందుకంటే కలిసి ఉండాలన్నదే తమ కోరిక తప్ప విడిపోయే వేళ వాటాల్లో తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన కూడా వారికీ రాలేదు. ఒకవేళ అదే చేసి ఉంటే ఏపీకి మేలు చేసేందుకు సోనియా సైతం ఒప్పుకునేవారనటంలో ఎటువంటి సందేహం లేదు. విభజన వేళ ప్రకటించిన పలు నిర్ణయాల్ని చూసినప్పుడు.. పలువురు ముక్కున వేలేసుకున్న పరిస్థితి. విభజనతో జరిగే నష్టానికి పరిహారం అంతంత మాత్రంగా ప్రకటించటమేకాదు.. విభజన కారణంగా చోటు చేసుకునే నష్టాలకు తగిన మూల్యాన్ని ఇచ్చింది లేదు.

 

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే తన ప్రసంగాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీని చిన్నబుచ్చేలా మాట్లాడటం మరో ఎత్తు అని చెప్పవచ్చు. తాజాగా నాగర్ కర్నూలులో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ఎస్సీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.తెలంగాణ వస్తే ఈ ప్రాంతం కారుచీకటి అవుతుంది. మీకు కరెంటు రాదని శాపాలు పెట్టారు. తెలంగాణ నేడు 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో ధగధగా మెరిసిపోతోంది. అదే ఆంధ్రాలో చిమ్మచీకటి అలుముకుంది. ఏపీ సహా దేశంలో మరే రాష్ట్రంలోనూ 24 గంటలు విద్యుత్ ఇచ్చే దిక్కు లేదు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే వ్యవస్థ ఎక్కడా లేనేలేదు అంటూ వ్యాఖ్యానించారు కెసిఆర్. కాగా కెసిఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నీ పని నువ్వు చేసుకో కేసీఆర్, ఆంధ్ర ప్రజలను గెలకడం అవసరమా అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -