Chandrababu Naidu: చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందా? దాడి చేయాలనుకున్నదెవరు?

Chandrababu Naidu: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో రాళ్ల దాడి ఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. చంద్రబాబు రోడ్ షోలో ఆగంతకుల రాళ్ల దాడి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనలో చంద్రబాబుపై గర్తు తెలియని వ్యక్తి రాయి వేశాడు. కానీ అది చంద్రబాబుకు కాకుండా ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకి తగలింది. దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలయ్యాయి. రాయి తగిలి రక్తస్రావం కావడంతో మధుబాబుకు ప్రాథమికి చికత్స అందించారు. తర్వాత ఆయనును ఆస్పత్రికి తరలించారు. రాయితో దాడి చేసిన క్రమంలో పవర్ కట్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

 

నందిగామ పర్యటనలో భాగంగా టౌన్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వాహనంపై ఎంపీ కేశినేని నాని, స్థానిక టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్డు షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పవర్ కట్ కాగా.. ఎవరో ఓ వ్యక్తి చంద్రబాబుపై రాయి విసిరాడు. అది చంద్రబాబు పక్కనే భద్రతను పర్యవేక్షిస్తున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మదుబాబుకు తగిలింది. దీంతో ఆయనకు తల నుంచి రక్తస్రావం అయింది. ఇది చూసిన చంద్రబాబు.. కేశినేని నాని చేతులోని మైకును తీసుకుని కోపంతో రలిగిపోయారు. రాళ్ల దాడి చేసిన వారిని వదిలిపెట్టమని, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 

తన రోడ్ షోకు స్థానిక పోలీసులు భద్రత కల్పించలేదని చంద్రబాబు ఆరోపించారు. దాడులకు భయపడేది లేదని వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అయితే రాళ్ల దాడి జరిగినప్పుడు పవర్ కట్ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఉన్నదెవరు.. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయాలనుకున్నదెవరు అనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రాళ్ల దాడి ఘటనతో చంద్రబాబు భద్రతపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నచంద్రబాబుపైనే రాళ్ల దాడి జరగడంపై టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

 

ఈ ఘటనతో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందా అనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా పలుమార్లు చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించారు. గతంలో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో కూడా చంద్రబాబుపై దాడి చేసేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 6+6గా ఉన్న చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను 12+12కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌ఎస్‌జీ కామాండోలతో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నారు.

 

గతంలో ఎన్ఎస్‌జీ ఆఫీసర్ విజయవాడకు వచ్చి చంద్రబాబు ఇళ్లు, టీడీపీ కార్యాలయం మొత్తం తిరిగి భద్రతను పరిశీలించారు. ప్రతీ రూమ్ తిరిగి భద్రతపై పర్యవేక్షించారు. అనంతరం చంద్రబాబుకు సెక్యూరిటీ మరింత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ గుండాళ్లే‌ రాళ్లు రువ్వారని, ఏపీలో రౌడీ పాలన నడుస్తున్నదని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించిన వారిని పట్టుకుని అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తోన్నారు.

 

చంద్రబాబు సభలకు వస్తున్న స్పందనను చూసి వైసీపీ ఓర్చుకోలేక పోతున్నదని, వైసీపీ రాజకీయానికి ఇది పరాకాష్ట అంటూ తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడికి పాల్పడిన వారినే వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, లేకపోతే ఆందోళనలకు దిగుతామని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -