Natural Star: న్యాచురల్ స్టార్ ను తొక్కేయాలని చూస్తున్నది ఎవరంటే?

Natural Star: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో నాని కూడా ఒకరు. నాని సినిమా ఇండస్ట్రీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. సొంత టాలెంట్ తో ఎదిగిన స్టార్ హీరో నాని. ఇక తెలుగులో నాని అష్టా చమ్మా, ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, నేను లోకల్, మజ్ను, అంటే సుందరానికి లాంటి సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

 

ఇటీవలే నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కాగా నాని ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తెగ చక్కర్లు కొడుతోంది. నాని హీరోగా ఎదుగుతున్న సమయంలో చాలామంది హీరోలు నాని నటన కు డెడికేషన్ కి ఫిదా అయ్యారు. ఇంకొందరు హీరోలు మాత్రం నానిని చూసి కుళ్ళుకునేవారట. ఇదే క్రమంలో ఓ స్టార్‌ హీరో నానిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చాడట. కానీ ఆ తర్వాతనే అతని అసలు నిజస్వరూపం తెలిసిందట.

 

ఆ స్టార్ హీరో ఫ్రెండ్షిప్‌ పేరుతో నానిని నిండా ముంచేసేందుకు ప్రయత్నించాడట. నానికి ఎలాంటి అవకాశాలు రాకుండా చేయాలని బాగానే ప్రయత్నాలు చేసాడట. కానీ చివరకు అతని నిజస్వరూపం తెలుసుకున్న నాని అతన్ని దూరం పెట్టేశాడు. ఇప్పటికీ ఆ స్టార్‌ హీరోతో నాని దూరంగానే ఉంటున్నాడట. తన పని ఏదో తాను చేసుకంటూ వెళ్లిపోతున్నాడు. అయితే నానిని నిండా ముంచేయాలని చూసిన ఆ స్టార్ హీరోకు ఇప్పుడు పెద్దగా కలిసి రావట్లేదు. అంతే కాకుండా వరుసగా ప్లాపులు కూడా వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -