Virat Kohli: కోహ్లి లైఫ్ ని మార్చిన ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరు ?

Virat Kohli: పరుగుల రారాజు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జంటకు క్రికెట్, సినీ ప్రపంచంలో ఫుల్ క్రేజ్ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు తమ ప్రేమను చాటుకుంటారు. ఇటీవల RCB పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, అనుష్కను కలిసిన క్షణం, తన జీవితం మారిపోయిందని విరాట్ చెప్పాడు. తండ్రి దూరమయ్యాక తనలో వచ్చిన మార్పును కూడా బయటపెట్టాడు.

 

విరాట్ కోహ్లి తన జీవితంపై తన భార్య అనుష్క ప్రభావం చాలా ఉందని చెప్పాడు. ఆమెను కలిసిన తర్వాత జీవితాన్ని వేరే కోణంలో చూడటం ప్రారంభించానని అన్నాడు. మా నాన్న నన్ను వదిలివెళ్లిన క్షణం.. జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది. ఆ సంఘటన భవిష్యత్తు గురించి నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. అయినా నా జీవితం మారలేదు. నా చుట్టూ ఉన్న ప్రపంచం మునుపటిలాగే ఉంది. నేను ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాను అని వెల్లడించిన ఈ స్టార్ బ్యాటర్, తన జీవితాన్ని మార్చిన సందర్భాన్ని చెప్పాడు.

నా జీవితాన్ని మార్చింది నా భార్య అనుష్క. ఆమెను కలిసిన క్షణం.. అప్పుడే జీవితంలో మరో కోణాన్ని చూశాను. నా ప్రపంచం మారినట్లు అనిపించింది. మీరు ప్రేమలో పడగానే.. మీలో కూడా ఆ మార్పులు రావడం మొదలవుతాయి. చాలా విషయాలు అంగీకరించాలి. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మార్పు మొదలవుతుంది. అందుకే ఆమెను కలిసిన క్షణాన్ని జీవితాన్ని మార్చే క్షణంగా పిలుస్తాను’ అని విరాట్ అన్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా విరాట్‌ నాలుగో టెస్టు మ్యాచ్‌ ఆడుతుండగా, అనుష్క శర్మ ప్రస్తుతం క్రికెట్‌ బయోపిక్‌ ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’లో నటిస్తోంది. ఈ సినిమా మాజీ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు వామిక పుట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -