Soundarya: సౌందర్య నటించనన్న ఆ స్టార్ హీరో ఎవరంటే

Soundarya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు వచ్చి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో సౌందర్య కూడా ఒకరు. హీరోయిన్ సౌందర్య ఇండస్ట్రీకి దూరమై చాలా కాలం అయ్యింది. అయినా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను గుర్తుపెట్టుకునే ఉంటారు. నేటి తరం యువ హీరోయిన్లకు సౌందర్య రోల్ మోడల్ అని చాలా మంది చెబుతూ ఉంటారు.

 

అప్పట్లో ఏ మగాడినైనా వారికి ఎలాంటి భార్య కావాలని అడిగితే సౌందర్యలాంటి భార్య కావాలని అనేవారు. ఆమె అంతలా అందరి మదిలో నిలిచిపోయారు. సౌందర్య తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ నటించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో ఆమె జత కట్టారు.

 

ఆ రోజుల్లో సౌందర్య డేట్స్ కోసం దర్శకనిర్మాతలు చాలా కాలం ఎదురుచూసేవారు. అంతలా ఆమెకు క్రేజ్ ఉండేది. ఎంతో మంది హీరోలతో నటించిన సౌందర్య ఒక్క నటుడితో మాత్రం నటించేందుకు ఒప్పుకోలేదట. అతను హీరోగా ఉంటే తాను ఆ సినిమాలో నటించలేనని డైరెక్టర్ కు మొహం మీదే చెప్పేసేదట.

 

ఇంతకీ సౌందర్య రిజెక్ట్ చేసిన హీరో ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో, కమెడియన్ గా మారిన ఆలీ. ఆయన హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో యమలీల సినిమా వచ్చి మంచి హిట్ కొట్టింది. అయితే ఆ సినిమా కథ విని హీరో ఎవరు అని సౌందర్య అడిగితే ఆలీ అని చెప్పడంతో ఆమె షాక్ అయ్యిందంట. తాను ఆ సినిమా చేయలేనని డైరెక్టర్ ముందే చెప్పేసిందట. దీంతో డైరెక్టర్ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఇంద్రజాను తీసుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా హిట్ అయ్యి ఇంద్రజకు అవకాశాలు వచ్చేలా చేసింది.

Related Articles

ట్రేండింగ్

TV Channels: టీవీ9, ఎన్టీవీ నంబర్ 1 కొట్లాట.. ఏది టాప్ అంటే?

TV Channels: తెలుగు న్యూస్ ఛానల్ మధ్య నెంబర్ గేమ్ నడుస్తుంది. పలు న్యూస్ ఛానల్ మేము నెంబర్ వన్ అంటే మేము నెంబర్ వన్ అని కొట్లాడుకుంటున్నారు. తెలుగు న్యూస్ చానల్స్...
- Advertisement -
- Advertisement -