Rajamouli Rishabh: రాజమౌళి రిషబ్ శెట్టిలలో ఎవరు గొప్ప.. సమాధానమిదే!

Rajamouli Rishabh: ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే అనే స్థాయిని, లైన్ ని చెరిపేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరున్న డైరెక్టర్ రాజమౌళి తన ‘బాహుబలి’ సినిమాతో అప్పటి వరకు ఉన్న చిన్నచూపును ఒక్క సినిమాతో పటాపంచలు చేశాడు. బాహుబలి మన దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేసిన మరో సినిమా ‘ఆర్ఆర్ఆర్’. నందమూరి నట వారసుడు తారక్, మెగా వారసుడు రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి చేసిన మరో కళాఖండం ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్ల మీద ప్రదర్శించబడిన ఈ సినిమాను భారీ స్థాయిలో రాజమౌళి తెరకెక్కించడం తెలిసిందే.

దాదాపు మూడు సంవత్సరాల పాటు దర్శక ధీరుడు రాజమౌళి.. దాదాపు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. జపాన్ లో ఈ సినిమా తాజాగా విడుదల కాగా.. అక్కడ విపరీతమైన ఆదరణకు నోచుకుంది. అయితే రీసెంట్ గా కన్నడలో వచ్చి సంచలన హిట్ అయిన సినిమా ‘కాంతార’.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ మరియు నటుడిగా గుర్తింపు సాధించిన రిషబ్ శెట్టి.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా ‘కాంతార’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సినిమా మంచి కంటెంట్ ఉండటంతో అన్ని భాషల్లో ఈ సినిమాకు ఆదరణ లభించింది. అయితే ఇప్పుడు రాజమౌళి మరియు రిషబ్ శెట్టిలను పోలుస్తూ.. ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తోంది.

రిషబ్ శెట్టి తన ‘కాంతార’ సినిమాను కేవలం రూ.16కోట్లతో నిర్మించాడు. ఆ సినిమా ఏకంగా దాదాపు రూ.400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూ.550 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే రూ.902 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ లెక్కన తక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీసి, ఎక్కువ వసూళ్లను రాబట్టిన డైరెక్టర్ల విషయంలో రాజమౌళి కంటే రిషబ్ శెట్టినే గ్రేట్ అనే చర్చ సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Jagan: పిల్లి పిల్లలను తిప్పిన్నట్లు సచివాలయ ఉద్యోగులను తిప్పుతున్న జగన్ సర్కార్.. ఏమైందంటే?

Jagan: పిల్లి తన పిల్లలను రక్షించుకోవడం కోసం ఒక చోటే ఉంచకుండా అన్ని చోట్లకు మారుస్తూ ఉంటుందట అలా ఉంది ప్రస్తుతం ఏపీ అధికార ప్రభుత్వం పనితీరు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...
- Advertisement -
- Advertisement -