Tarak Mahesh: తారక్, మహేష్ బాబులలో నిజమైన మాస్ హీరో ఎవరంటే?

Tarak Mahesh: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తాజాగా రూపొందుతున్న సినిమా గుంటూరు కారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్, ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

వీటికి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు సంబంధించిన గ్లింప్స్ ని చూసిన మహేష్ అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే మాములుగా త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ అ అనే అక్షరంతో మొదలవుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. అయితే ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత మహేష్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.

 

ఈ ఇద్దరు హీరోలలో మాస్ హీరో ఎవరంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ చర్చలు జరుగుతున్నాయి. మాస్ అంటే మహేష్ బాబు అని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేయడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ రచ్చ మొదలు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లగా మహేష్ బాబు ఒక ప్రముఖ ఛానల్ లోని సీరియల్ ను ప్రమోట్ చేశాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి గొడవలు లేవనే సంగతి తెలిసిందే. మహేష్, తారక్ జోక్యం చేసుకుంటే మాత్రమే ఫ్యాన్స్ మధ్య వివాదాలు ఆగిపోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలపై తారక్ మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -