CM Jagan: అదానీ అంటే జగన్ కు ఎంత ప్రేమో.. మరీ ఇలా చేయాలా?

CM Jagan: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆస్తులను జగన్మోహన్ రెడ్డి ఆదానీకి కట్టబెట్టే ప్రక్రియను మాత్రం ఆపడం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సరికాదని ఆయన తెలియజేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తున్నారని తెలుస్తోంది.

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)ని అడ్డుపెట్టుకుని అదానీ నుంచి 7000 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.49 చొప్పున కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసినటువంటి సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను బహిర్గతం చేయాలని పలువురు డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే సెకీ ఒప్పందానికి ఏపీఈఆర్‌సీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా సెకీకి యూనిట్‌కు ఏడు పైసల చొప్పున కమీషన్‌ చెల్లించేందుకు ఇంధన శాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాలను బహిర్గతం చేయాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వం పై ప్రతి ఏడాది అదనంగా భారం కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

రాజస్థాన్‌ నుంచి విద్యుత్‌ రాష్ట్రానికి రావాలంటే పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీజీసీఎల్‌)కు వీలింగ్‌ చార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి వీలింగ్‌ చార్జీలు వర్తించవని రాష్ట్ర ఇంధన శాఖ 2021లో ఒప్పందం చేసుకునే సమయంలో స్పష్టం చేసింది అయితే ఈ ఒప్పందం ప్రకారం కాకుండా ప్రతి ఏడాది ఏడు పైసలు చొప్పున చార్జీలు చెల్లిస్తే 250 కోట్ల భారం ఉంటుందని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఖజానాను జగన్మోహన్ రెడ్డి ఇలా ఆదానీకి పంచడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -