B Gopal: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి పేరు పరిచయం అక్కరలేనిది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి అనే మహా వృక్షం నీడలో చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.
ప్రస్తుతం వీళ్లు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఇక చిరంజీవి రాజకీయంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా చిరు సినిమా అవకాశాలను అందుకుంటు ఇప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇక చిరు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ తన సినిమాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.
ఇదంతా పక్కన పెడితే అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలించిన మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందు.. బి.గోపాల్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. ఎనుకంటే బి గోపాల్ అప్పటికే ఫ్యాక్షన్ సినిమాలు చేయడంతో.. చిరంజీవితో కూడా అదే సినిమా చేస్తే ప్రేక్షకులు చూస్తారా? అసలు వాళ్లకి నచ్చుతుందని మొదట బి.గోపాల్ అయోమయం అయ్యాడట.
దాంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. ఈ విషయంలో పరిచూరు గోపాలకృష్ణ గోపాల్ కి నచ్చ చెప్పడానికి చూసినప్పటికీ నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి అని గోపాల్ అన్నాడట. సక్సెస్ఫుల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ ఆన్ అదర్ ఫేస్ అని పరుచూరి గోపాలకృష్ణ ఒక మాట అన్నాడంట. ఆ ఒక్క మాటతో బి గోపాల్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోక తప్పలేదు. అప్పట్లో ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందించి పెట్టింది.