BlackThread: ఈ రాశి వారు నల్లదారం కట్టుకుంటే అపశకునాలే!!

BlackThread: ఈ మధ్య అందరూ కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారు. ఒకప్పుడు చిన్న పిల్లలకు మాత్రమే దిష్టి తగలకుండా ఈ దారం కట్టేవారు. కానీ.. ఇప్పటి కాలంలో పెద్దవారు కూడా ఫ్యాషన్‌ పేరుతో అందరూ కట్టుకుంటున్నారు.అయితే ఇలా కాలికి నల్ల దారం కట్టుకోవడం అందరికీ మంచిది కాదంటున్నారు జ్యోతిష్యులు. ఈ విషయం చాలా మందికి తెలియక నల్లదారం కట్టుకుంటున్నారు. చెడు శక్తులు, తిష్టి తగలకుండా, అంతా మంచి జరగాలని ఈ నల్లదారాన్ని కాలికి కట్టుకుంటారు.అయితే.. ఇది కొన్ని రాశుల వారికి మాత్రమే మంచి బాగా పని చేస్తోందని మిగతా వారికి ఇబ్బందులకు గురి చేస్తోందని కొన్ని శాస్త్రలు, కొందరు పండితులు చెబుతున్నారు.

ఈ నల్ల దారాన్ని ధనుస్సు, తులా, కుంభ రాశి వారు మాత్రమే కట్టుకుంటే వారికి కీడు పనులు జరగకుండా మంచి పనులే జరుగుతాయట. అంతేకాక ఆర్థిక సమస్యలు ఉండే అవి కూడా దూరమవుతాయని సూచిస్తున్నారు. వృశ్చికం, మేష రాశి వారు కట్టుకోవడం వలన మనశ్శాంతి, సంతోషం ఉండదు. ఈ రాశుల వారు అంగారకుని యొక్క ఆధీనంలో ఉంటారు. అంగారకుడికి నలుపంటే నచ్చదు. ఈ రాశుల వారు నల్లదారం కట్టుకోవడం వలన వీరికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెడు జరుగుతుందని చెబుతున్నారు.

శివుడికి నలుపు అంటే చాలా ఇష్టమైన రంగు. అంతేకాక శనికి కూడా నలుపు రంగే ఇష్టం ఉంటుంది. అందుకే శనివారం రోజు మొదటగా రుద్ర గాయత్రి మంత్రం చదువుతూ ఈ నల్ల దారం కాలికి కట్టుకోవాలి. చేతికి దేవునికి సంబంధించిన పసుపుతాడు, ఎర్ర తాడు ఉన్నవారు నల్ల దారం కట్టుకోవాల్సిన అవసరం లేదు. రుద్ర గాయత్రి మంత్రం చెబుతూ ఇలా నల్ల దారం కట్టుకోవడం వలన చీడపీడల నుండి దూరంగా ఉంటారు. శనీశ్వరుడు యొక్క కటాక్షము లభించి కష్టాల నుండి బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -