Rohit: గాయంతో టీమ్ కు దూరమైన రోహిత్ బింబాబ్వే జట్టుతో ఎందుకున్నాడు?

Rohit: బంగ్లాదేశ్‌ క్రికెట్ టీమ్ తో ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆ టోర్నీలో చివరి వన్డే మ్యాచ్ తో పాటుగా తొలి టెస్టులో సైతం ఆడలేదు. రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా మొదట బౌలింగ్ చేసింది. ఆ సమయంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకో బోయి గాయపడ్డాడు. ఆ టైంలో రోహిత్ శర్మ బొటన వేలికి గాయం అయిన సంగతి తెలిసిందే. మైదానం నుంచి హాస్పిటల్ కి వెళ్లిన రోహిత్ శర్మ స్కానింగ్ చేయించుకున్నాడు.

 

ఆ తర్వత చేతికి కట్టు కట్టుకుని మైదానంలో అడుగు పెట్టాడు. ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. బ్యాటింగ్ కు మాత్రం తప్పని పరిస్థితిలో 9వ స్థానంలో దిగాడు. అయినప్పటికీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు. అయితే విజయానికి 5 రన్స్ దూరంలో ఆగిపోయాడు. ఆ సమయంలో రోహిత్ స్పిరిట్ కు అందరూ మెచ్చుకున్నారు. మ్యాచ్ అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిత్ శర్మ ముంబైకి చేరాడు. చికిత్స తీసుకున్నాక మళ్లీ ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ ఫోకస్ పెట్టాడు.

 

తాజాగా శుక్రవారం రోజు రోహిత్ శర్మ జింబాబ్వే అండర్ 19 టీమ్ తో ఫోటోలు దిగారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే గాయంతో ఉన్న రోహిత్ శర్మ జింబాబ్వే జట్టుతో ఏం చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ముంబైలో ఉన్నటువంటి జింబాబ్వే అండర్ 19 జట్టుకు రోహిత్ శర్మ మోటివేషనల్ క్లాసులు తీసుకున్నాడు. కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో వారికి తెలిపాడు.

 

క్రికెటర్లు తమ కెరీర్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలి, ఎలాంటి మైండ్‌సెట్‌ కలిగి ఉండాలనే దానిపై జింబాబ్వే ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. యువ క్రికెటర్లకు రోహిత్ చేసిన పలు సూచనలు ఎంతగానో స్పూర్తినిచ్చాయి. కాగా రోహిత్ ఎక్కడున్నా రాజేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: వైఎస్ షర్మిల షాకింగ్ ప్లాన్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే కలిసిందా.. దీని వెనక...
- Advertisement -
- Advertisement -