Kasani: తెలంగాణ టీడీపీలోకి కాసాని ఎంట్రీ ఎందుకు? హాట్ టాపిక్‌గా మారిన కీలక పరిణామం

Kasani: కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ టీడీపీ ఎంట్రీ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిర్స్ లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలోనే ఆయన ఎందుకు చేరారనేది హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆహ్వానాలు వచ్చినా.. ఆయన టీడీపీని ఎందుకు ఎంచుకున్నారనేది రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తమ పార్టీలో చేరాలని అధికార టీఆర్ఎస్ పార్టీ ఆయనను ఆహ్వానించింది. మంత్రి హరీష్ రావు స్వయంగా ఇటీవల కాసానిని కలిసి టీఆర్ఎస్ లో చేరితే ప్రాధాన్యత ఇస్తామని, గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాంగా ఎదుగుతున్న బీజేపీ కూడా ఆయనను ఆహ్వానించలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్వయంగా కాసానిని కలిసి పార్టీలో చేరాల్సిందిగా కోరారు.

దీంతో టీఆర్ఎస్ లేదా బీజేపీలో కాసాని చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్, బీజేపీలను కాదని ఆయన టీడీపీని ఎంచుకోవడం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోుంది. గతంలో ఆయన టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు స్వయంగా కండువా కప్పి కాసానిని టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వెంటనే ఆయనను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నర్సింహులు ఉన్నారు. ఆయనను తొలగించి కొత్తగా పార్టీలో చేరిన కాసానికి తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించారు.

టీడీపీ, బీజేపీ ఆహ్వానించినా టీడీపీలో చేరుతానని చంద్రబాబుకు స్వయంగా కాసాని సమాచారం పంపించారు. దానికి చంద్రబాబు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోవడం, టీటీడీపీ అధ్యక్షుడిగా నియామకం కావడం జరిగిపోయాయి. టీడీపీ నుంచి నేతలందరూ వెళ్లిపోయారు కానీ ఎవరూ చేరలేదు. మిగిలిన కాస్త నేతలు కూడా టీడీపీలో సైలెంట్ గా ఉన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో తెలంగాణలో కొంతమంది నేుతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచాంర జరుుతోంది. మునుగోడు టీఆర్ఎస్ దక్కని భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది.

మునుగోడు టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. నర్సయ్యగౌడ్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడం, బీసీల పార్టీగా టీడీపీకి పేరు ఉండటంతో.. ఆయన సైకిలెక్కుతారనే వార్తలు వచ్చాయి. మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ ఉండటం, గతంలో నర్సయ్యగౌడ్ టీడీపీలో పనిచేయడంతో.. మునుగోడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ మునుగోడు పోటీ నుంచి టీడీపీ తప్పుకోవడంతో నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలను కలిసి ఆయన.,. నేడో, రేపో బీజేపీలో చేరనున్నారు.

కానీ వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అప్పటిలోగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు, క్యాడర్ ను మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. అందుకోసం మునుగోడు ఉపఎన్నికలకు పార్టీ సిద్దం కావకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో నర్సయ్యగౌడ్ టీడీపీలో చేరలేదు. ఇప్పుడు కాసాని టీడీపీలో చేరడంతో మరికొంతమంది చేరే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగేందుకు టీడీపీ సిద్దమవుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -