Guntakal: బెడ్రూమ్‌లో భార్యతో చిన్నాన్న కొడుకు రాసలీలలు.. భర్త ఎంట్రీతో..

Guntakal: కొందరి తెగింపుతో రోజురోజుకు మానవ విలువలు మంటలో కలుస్తున్నాయి. వారి సంతోషాలు, సుఖాల కోసం అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ కుటుంబాలను బజారుకీడుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు. భర్తకు తెలియకుండా భార్యనో.. ఆమెకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుంతకల్లు మండలం గుండాల తండా కు చెందిన స్వామి నాయక్, మంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితమే గుంతకల్లులోని చెతన్య థియేటర్‌ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవçనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌లో స్వామినాయక్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబ అక్కడి నుంచే డబ్బు పంపించేవాడు. అయితే స్వామినాయక్‌ చిన్నాన్న కుమారుడు సుంకేనాయక్‌ తరచూ మంగమ్మ ఇంటికి రాకపోకలు సాగించేవాడు. కుటుంబ వివరాలు అడుగుతూ ఉండేవాడు.

క్రమంలో బుధవారం ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత మంగమ్మ ఇంటికి సుంకేనాయక్‌ వచ్చాడు. గంట తర్వాత స్వామినాయక్‌ సైతం ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన స్వామినాయక్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బెడ్రూమ్‌లో సుంకేనాయక్, మంగమ్మ ఏకాంతంగా ఉండడం చూసిన స్వామినాయక్‌ కట్టలు తెంచుకునే కోపంతో అక్కడే ఉన్న కత్తి తీసుకుని సుంకేనాయక్‌పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన భార్య మంగమ్మ తలపై బాది నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని పరిశీలించగా సుంకేనాయక్‌ అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మంగమ్మను స్థానికుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ వార్త తండా మొత్తం పాకడంతో ఇలా తప్పుడు పనులు చేస్తున్న వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాడని స్వామి నాయక్‌కు మద్దతు తెలుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -