Actress Meena-Kiccha Sudeep: మీనా కిచ్చా సుదీప్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా.. షాకింగ్ విషయాలు రివీల్..?

Actress Meena-Kiccha Sudeep: ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన “నవయుగం” అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఇలా తెలుగు, మలయాళీ, తమిళ్ , కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన మీనా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

అప్పట్లో మీనా నటించిన సినిమాల కన్నా ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా వైరల్ అయ్యాయి. కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో మీనాకి రహస్య వివాహం జరిగిందని రూమర్లు వినిపించాయి.మీనా సుదీప్ కలిసి రెండు సినిమాలలో జంటగా నటించారు. 2003 లో స్వాతి ముత్తు అనే సినిమాలో మొదటి సారి కలిసి నటించగా, 2006 లో మై ఆటోగ్రాఫ్ సినిమాలో రెండవసారి జంటగా నటించారు.

ఇలా రెండు సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరూ సినిమా షూటింగ్ లోకేషన్ లో ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇద్దరు స్పందించినా కూడా వార్తల జోరు మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో సుదీప్ మీడియా ముందు స్టేట్మెంట్ ఇస్తూ. మీనాతో రహస్య వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలపై ఎటువంటి నిజం లేదని వెల్లడించాడు.

అయినా కూడా ఈ వార్తలు వైరల్ అవటంతో మీనా స్పందిస్తూ.. ఇప్పటికే మీడియా వాళ్ళు నాకు మూడుసార్లు పెళ్లి చేశారు. నా పెళ్లి విషయంలో మీడియా అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తుందో అర్థం కావటం లేదు. సుదీప్ కి నాకు పెళ్లి జరిగినట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. రెండు సినిమాలలో కలిసి నటించిన మాత్రాన రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని వెల్లడించింది. అయినా నా పెళ్లి గురించి మీడియా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. అందరికీ ఆహ్వానం పంపే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -