Akkineni Heroes: అక్కినేని హీరోలకు ఎప్పటికి హిట్టొస్తుందో.. అయ్యో పాపమంటూ?

Akkineni Heroes: అక్కినేని ఫ్యామిలీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అక్కినేని హీరోలు నటించిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ గా అవుతున్నాయి. నాగార్జున, తనయులు అఖిల్, నాగచైతన్య, సరైన సాలిడ్ హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే నటించిన మనకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపడుతూ జనాల్లోకి సినిమాను బాగా తీసుకెళ్తున్నప్పటికీ అక్కినేని హీరోలకు లెక్క కలిసి రావడం లేదు. కథలు ఎంపిక విషయంలో అక్కినేని హీరోలు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు.

అక్కినేని హీరోలు నటించిన సినిమాలు సక్సెస్ అవ్వడం సంగతి పక్కన పెడితే కనీసం సినిమాలు థియేటర్లలో వారం రోజులు కూడా ఆడటం లేదు. నాగచైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఏజెంట్ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో అక్కినేని అభిమానుల బాధ మామూలుగా లేదు. ఇది ఇలా ఉంటే చైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. నేడు విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

 

అయితే కష్టడీ సినిమా సక్సెస్ అయ్యి అక్కినేని అభిమానులకు ఊరటనిస్తుంది అని అందరూ భావించినప్పటికీ ఊహించని విధంగా ఇలా మిశ్రమ స్పందన రావడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అక్కినేని హీరోలు ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి పట్టుకున్న దరిద్రం మాత్రం వదలడం లేదు. అక్కినేని ముగ్గురు హీరోలు కూడా సరైన హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఇప్పట్లో సరైన హిట్టు రావడం కష్టమే అన్న వార్తలు కూడా మొదలయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -