Anushka: అనుష్క అతి త్వరలో ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పనుందా?

Anushka: కింగ్ నాగార్జున సినిమా అయిన సూపర్ మూవీ ద్వారా హీరోయిన్ అనుష్క శెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అనుష్క రెండో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. సూపర్ తర్వాత అనుష్క శెట్టి వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమా అయిన అరుంధతిలో నటించి మెప్పించింది. ఆ సినిమా చేశాక మళ్లీ అనుష్క తిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకూ ఆమె కొనసాగుతూనే వచ్చింది.

 

ఇప్పటి వరకూ తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితో అనుష్క నటించింది. టాలీవుడ్ లో ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచచ్చుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అనుష్క ఇంకా పెళ్లికి మాత్రం దూరంగా ఉంది. చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లు అందరికీ పెళ్లిల్లు జరుగుతున్నా అనుష్క మాత్రం తన పెళ్లి ప్రస్తావనే తీసుకురాకుండా ఉంది. అనుష్క, ప్రభాస్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని, అందుకే వీరిద్దరూ పెళ్లికి దూరంగా ఉన్నారని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే అలాంటిదేమీ లేదని ఆ మధ్య ప్రభాస్, అనుష్కలు క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని తెలిపారు. అయినా వీరిపై వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అనుష్క ఓ కుర్ర హీరోతో ప్రేమలో పడిందని తెలుస్తోంది. వీటికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ హీరోతో ప్రేమ అంటే నిజమని నమ్మేరు. ఈ లవ్ నిజ జీవితంలో కాదు. తెరపై మాత్రమేనని తెలుసుకోవాలి. నవీన్ పోలిశెట్టితో అనుష్క ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

 

ఈ కొత్త సినిమాలో అనుష్క పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో కనిపించనుంది. తనకంటే చిన్న అబ్బాయితో ఆమె ప్రేమలో పడుతుందని, ఈ నేపథ్యంలోనే కథ సాగుతుందని తెలుస్తోంది. చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క మళ్లీ ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని అందరూ అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -