Waltair Veerayya: వాల్తేరు వీరయ్య రవితేజ రోల్ లో చరణ్ ఉంటే ఫ్లాప్ అయ్యేదా?

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరుచూరి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య హిట్‌ అయ్యిందని తెలిసినప్పుడు ఎంత ఆనందించాను. అలాగే సినిమా చూస్తున్నంత సేపు అంతే సంతోషాన్ని పొందాను.

మనం కొన్ని సినిమాలను చూసినప్పుడు మనల్ని కొన్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ, ఇది వెంటాడే సినిమా కాదు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. దర్శకుడు కథను చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ షాట్‌కు ఆడిటోరియం మొత్తం షాక్‌ అయిపోయి ఉంటుంది. సినిమా పూర్తయ్యాక వచ్చే సందేశం అందరితో చప్పట్లు కొట్టిస్తుంది. అయితే ఇందులో రవితేజ పోషించిన పాత్రను రామ్‌ చరణ్‌ చేసి ఉంటే ఎలా ఉంటుందా? అని ఆలోచించాను. రవితేజ పాత్ర చిత్రీకరణ చూశాక, చరణ్‌ చేస్తే బాగోదనే నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే, తమ్ముడి పాత్రలో చరణ్‌కు అన్యాయం జరిగినట్టు చూపిస్తే చిరంజీవి పాత్రకు మైనస్‌ మార్కులు పడేవి.

 

ఆ పాత్రకు రవితేజను ఎంపిక చేసుకోవడం బాగుంది. ఆయన అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులు సరిగ్గా గమనిస్తే ఈ సినిమాలో రవి బాడీ లాంగ్వేజ్‌ కాస్త భిన్నంగా ఉంటుంది. చిరంజీవి సినిమా కాబట్టి మెగా ఆడియన్స్‌ పల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయన నటించాడు. చిరంజీవి, రవితేజ వాళ్ల అనుబంధం, హీరోయిన్స్‌తో ప్రేమాయణం వంటివి మాత్రమే చూపిస్తే సినిమా హిట్లు అయ్యేది కాదు. కథా కథనం బాగుంటే.. సినిమా నిడివి ఎంత ఉన్నా ప్రేక్షకులు కళ్లార్పకుండానే చూస్తారు. అలా చూసినప్పుడు తప్పకుండా ఆ సినిమా హిట్టైనట్టే అదే ఇక్కడ జరిగింది అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -