GVL Narasimha Rao: వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్న జీవీఎల్?

GVL Narasimha Rao: జీవీఎల్ నరసింహరావు ఏపీ రాజకీయాల్లో ముఖ్యనేతగా ఉన్నారు. ఏపీ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి తన వాయిస్ ను బలంగా వినిపిస్తూ ఉంటారు. ఏపీ బీజేపీలో గట్టిగా వాయిస్ వినిపించే నేత ఆయన ఒక్కరే. బీజేపీలో ఆయన కంటే గట్టిగా వాయిస్ వినిపించే నేత ఇంకెవరూ లేరు. బీజేపీలో మిగతా నేతలందరూ సైలెంట్ గా ఉంటారు. తమ వాయిస్ ను ఎవరూ బలంగా వినిపించరు. ఏపీ బీజేపీ నుంచి సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావు ఇద్దరూ కొంచెం బలంగా వాయిస్ వినిపిస్తారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లాంటి కొంతమంది కీలక నేతలు ఉన్నా.. వారందరూ టీడీపీ నుంచి వెళ్లినవారు కావడంతో బీజేపీని ఓన్ చేసుకోలేకపోతున్నారు.

అయితే జీవీఎల్ నరసింహరావు ఎక్కువగా ఏపీ బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తారు. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నారు. అయితే త్వరలోనే ఆయన రాజ్యసభ పదవి ముగియనుంది. మరోసారి ఆయనను రెన్యూవల్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇంతకుముందు జాతీయ స్థాయిలో బీజేపీ అధికార ప్రతినిధిగా జీవీఎల్ సరసింహరావు ఉన్నారు. ఇప్పుడు ఆ పదవి కూడా లేదు. దీంతో ఏ పదవి లేకపోతే రాజకీయంగా పలుకుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్లే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని జీవీఎల్ చూస్తున్నారు.

దీని కోసం విశాఖ పార్లమెంట్ స్థానాన్ని ఆయన ఎంచుుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఇటీవల విశాఖలోనే జీవఎల్ నరసింహరావు ఉంటున్నారు. విశాఖలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. విశాఖకు చెందని కొంతమంది స్థానిక బీజేపీ నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీకి విశాఖ పార్లమెంట్ స్థానంలో కొంచెం బలంగా ఉంది. గతంలో టీడీపీలో పొత్తులో బీజేపీ నుంచి ఇక్కడ హరిబాబు ఎంపీగా గెలుపొందారు. దీంతో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని జీవీఎల్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

విశాఖను రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి ఇన్ డైరెక్టుగా జీవీఎల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏపీ బీజేపీ అమరావతి రాజధానిగా ఉండాలని చెబుతోంది. కానీ జీవీఎల్ మాత్రం విశాఖకే మద్దతు తెలుపుతున్నారు. జగన్ నిర్ణయాన్ని ఆయన ఎప్పుడూ ఖండించలేదు. పైకి అమరావతికే సపోర్ట్ అని చెబుతున్నప్పటికీ.. లోపల జగన్ నిర్ణయానికి జీవీఎల్ మద్దతు తెలుపుతున్నారు. విశాఖ కీలక ప్రాంతం కావడంతో.. అక్కడ నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంచి పలుకుబడి ఉంటుంది. అందుకే విశాఖ పార్లమెంట్ స్థానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటే ఇక్కడ గెలవడం ఖాయమని జీవీఎల్ అంచనా వేసుకున్నారు. అందుకే టీడీపీతో పొత్తు ఉంటే తన గెలుపు ఖాయమవుతుందని జీవీఎల్ నరసింహరావు భావిస్తున్నారు. అందుకే నిరంతరం విశాఖలోనే జీవీఎల్ ఉంటున్నారని, అక్కడే మకాం వేశారని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -